వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం
గాజులదిన్నెలో లాంతరుతో నిరసన తెలుపుతున్న బీవీ

మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి


గోనెగండ్ల, మే 20: రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం గాజులదిన్నె గ్రామంలో పార్టీ గౌరవ సభ, బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో టీడీపీ జెండాను ఎగురవేశారు. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ లాంతరు, కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అనంతరం గ్రామంలో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచి పెట్టారు. బీవీ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఆర్‌డీఎస్‌, వేదవతి, గుండ్రేవుల, ఎల్లెల్సీ పనులు సాగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని తెలిపారు. మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్‌ చార్జీలు, రెండు సార్లు బస్సు చార్జీలు పెంచారని పెట్రోల్‌, డీజిల్‌, ధరలు విపరీతంగా పెంచారన్నారు.  ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టులో ఉన్న నీటిలో 0.38 టీఎంసీల నీటిని ఎమ్మిగనూరు వాటర్‌గ్రిడ్‌కు మళ్లించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ నజీర్‌సాహెబ్‌, తిరుపతయ్యనాయుడు, మాజీ సర్పంచ్‌ సంజన్న, రాముడు, ప్రభాకర్‌, చంద్ర, వేణుగోపాలాచారి, కులుమాల రాముడు, రమే్‌షనాయుడు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST