కేంద్ర నిరంకుశ విధానాలను తిప్పికొడదాం

ABN , First Publish Date - 2022-08-01T06:01:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతులపై అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను తిప్పికొడదామని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు పిలుపునిచ్చారు.

కేంద్ర నిరంకుశ విధానాలను తిప్పికొడదాం
అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద నిరసన తెలుపుతున్న రైతు సంఘాల సభ్యులు


 ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి

అరసవల్లి, జూలై 31: కేంద్ర ప్రభుత్వం రైతులపై అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను తిప్పికొడదామని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం సమన్వయ సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు  మాట్లాడు తూ.. ఏడాది పాటు రైతులు నిరంతరాయంగా చేసిన పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను వెనక్కు తీసుకుందని అన్నారు. ఈ సందర్భంగా పంటల మద్దతు ధర తెస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు నుంచి వ్యవసాయాన్ని మినహాయిస్తామని, లఖింపూర్‌ సంఘటనలోని దోషులను శిక్షిస్తామని రాతపూర్వకంగా కిసాన్‌ సంయుక్తమోర్చా కమిటీకి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ హామీలను నేడు తుంగలో తొక్కి అధికారులతో, బీజేపీకి చెందిన రైతు నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి ఏకపక్షంగా కొత్త బిల్లు తయారు చేసిందని ఆరోపించారు. 9 కోట్ల మంది పేదరైతులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ పేదలపై జీఎస్టీ భారాన్ని మోపిందని విమర్శించారు. కేంద్ర చేసిన ఈ పనికి వ్యతిరేకంగా జూలై 31వ తేదీన రైతు విద్రోహ దినంగా పాటిద్దామని, కేంద్రప్రభుత్వ నిరంకుశ విధానా లను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, నాయకులు తాండ్రప్రకాష్‌, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్‌.కృష్ణవేణి, ఈశ్వరమ్మ, డి.గణేష్‌, శ్రీరాములు, శ్రీనివాసరావు, వెలమల రమణ, కృష్ణ, పొందూరు చందరరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-01T06:01:10+05:30 IST