దమ్ముంటే చర్చ పెట్టండి: కేంద్రానికి రాహుల్ సవాల్

ABN , First Publish Date - 2021-12-20T20:09:23+05:30 IST

ఇదేం ప్రభుత్వం? ఈ ప్రభుత్వానికి పార్లమెంట్‌ను ఎలా నడపించాలో కూడా తెలియదు. అధిక ధరలు, లఖింపూర్ దారుణం, కనీస మద్దతు ధర, లద్దాఖ్, పెగాసస్ కేసు, సస్సెండ్ అయిన ఎంపీలు.. ఈ విషయాలపై మా గొంతును మీరు కట్టడీ చేయలేరు. దమ్ముంటే చర్చ పెట్టండి..

దమ్ముంటే చర్చ పెట్టండి: కేంద్రానికి రాహుల్ సవాల్

న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం, సభలను మాటిమాటికీ వాయిదా వేయడం కాకుండా దేశ సమస్యలపై చర్చ పెట్టాలంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడడంపై ఆయన స్పందిస్తూ ‘దమ్ముంటే చర్చ పెట్టండి’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్‌ను నడిపించడమే రాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన సమస్యలు ఇవంటూ తన ట్వీట్‌లో రాహుల్ ఏకరువు పెట్టారు.


‘‘ఇదేం ప్రభుత్వం? ఈ ప్రభుత్వానికి పార్లమెంట్‌ను ఎలా నడపించాలో కూడా తెలియదు. అధిక ధరలు, లఖింపూర్ దారుణం, కనీస మద్దతు ధర, లద్దాఖ్, పెగాసస్ కేసు, సస్సెండ్ అయిన ఎంపీలు.. ఈ విషయాలపై మా గొంతును మీరు కట్టడీ చేయలేరు. దమ్ముంటే చర్చ పెట్టండి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాలపై చర్చించాలని నినాదాలు చేయడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు.

Updated Date - 2021-12-20T20:09:23+05:30 IST