రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2021-11-27T06:28:44+05:30 IST

భారత రాజ్యాంగాన్ని కాపాడుకొనే బాధ్యత పౌరులందరి మీద ఉందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

  1. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు 


కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 26: భారత రాజ్యాంగాన్ని కాపాడుకొనే బాధ్యత పౌరులందరి మీద ఉందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతు భరోసా) తమీమ్‌ అన్సారీయా, డీఆర్వో పుల్లయ్య, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగం పీఠికను అందరితో చదివించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం (నేషనల్‌ లా డే)గా కూడా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం పటిష్టమైనదన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌, షెడ్యూళ్లలోని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి, పురోగతికి కృషి చేయాలన్నారు. కుల, మత, జాతి, వర్గ, వివక్ష లేకుండా పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. రాజ్యాంగం హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా ఇచ్చిందని, వాటిని పాటించినప్పుడే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. 

Updated Date - 2021-11-27T06:28:44+05:30 IST