స్వచ్ఛ శ్రీకాకుళానికి నాంది పలుకుదాం

ABN , First Publish Date - 2020-12-05T05:17:50+05:30 IST

ప్రజలు పోలీసులకు, నగరపాలక సంస్థ అధికారులకు సహకరించాలని, తద్వారా స్వచ్ఛ శ్రీకాకుళానికి నాంది పలుకు దామని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు.

స్వచ్ఛ శ్రీకాకుళానికి నాంది పలుకుదాం
ఎస్పీ నుంచి నగదు పురస్కారం అందుకుంటున్న ఎస్‌ఐ


  ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలి: ఎస్పీ అమిత్‌బర్దర్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 4: ప్రజలు పోలీసులకు,  నగరపాలక సంస్థ అధికారులకు సహకరించాలని, తద్వారా స్వచ్ఛ శ్రీకాకుళానికి నాంది పలుకు దామని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో నగర ప్రజలు, వ్యాపారులు, ఇతర వర్గాలతో ‘మన శ్రీకాకుళం మన బాధ్యత’ పేరుతో శుక్ర వారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లా డారు.  జిల్లాలో ట్రాఫిక్‌, పారిశుధ్యం, ప్రజారోగ్యం, తదితర సమస్యలపై ప్రతిఒక్కరూ బాధ్యతగా  సురక్షితమైన మార్గాలు అవలంభించాలని తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రజలు సహకరించాలన్నారు.  ముఖ్య కూడళ్లు, రోడ్లపై తోపు డు బండ్లు, ఇతర చిరు దుకాణాలతో  ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమవుతుంద న్నారు. జీటీ రోడ్డులో సెం టర్‌ పార్కింగ్‌ ఉన్నప్పటికీ.. దుకాణాల వద్దనే కొందరు వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారన్నారు. సంక్రాంతి సీజన్‌లో  జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు నగరానికి వచ్చే అవకాశం ఉంటుందని... నిర్దిష్ట ప్రాంతంలోనే పార్కింగ్‌ ఉండాలని ఎస్పీ సూచించారు. తోపుడుబండ్ల వారు సైతం గుర్తింపు కార్డులు ధరిస్తే.. పరిమితమైన దుకాణాలతో ట్రాఫిక్‌ సమస్య లేకుండా వ్యాపారాలు కూడా జరుగుతాయని వివరించారు. ఆటో వాలాలు కూడా  పోలీసులకు  తెలిపారు.  కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య, అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు ప్రసాదరావు, మహేంద్ర,  తదితరులు పాల్గొన్నారు.  


వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పోలీసులను ఎస్పీ అమిత్‌బర్దర్‌ అభినందించారు. జి.సిగడాం మం డలం వాండ్రంగి రైల్వేగేటు సమీ పంలో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పి.ఈశ్వరరావు ఆత్మహత్య చేసుకు నేందుకు యత్నించాడు. ఈ విష యాన్ని గమనించిన రైల్వే గేట్‌ కీపర్‌ గోవిందరాజులు పొందూరు పోలీసు లకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ దేవానందం, కానిస్టేబుల్‌ సంతోష్‌కు మార్‌లు వెళ్లి ఈశ్వరరావును ప్రాణాలతో రక్షించారు.  వారిని జిల్లా పోలీసు కార్యా లయంలో ఎస్పీ అభినందించారు. ఇద్దరికీ నగదు పురస్కారాలను అందించారు.

  

Updated Date - 2020-12-05T05:17:50+05:30 IST