ఒత్తిడిని చిత్తు చేయండిలా...!
ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒత్తిడి. అది ఏరకమైన ఒత్తిడినైనా మంచి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎదుర్కోవాలని అంటున్నారు మానసిక నిపుణులు
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒత్తిడి. అది ఏరకమైన ఒత్తిడినైనా మంచి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎదుర్కోవాలని అంటున్నారు మానసిక నిపుణులు.
- బ్లూబెర్రీస్‌లో సి- విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని అధిగమించడానికి ఈ రెండూ ఉపయోపడతాయి. ఒత్తిడిగా అనిపించిన సమయంలో బ్లూబెర్రీస్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ గ్లాసు పాలు తాగాలని అందరూ చెప్పేదే. అయితే పాలు తాగడం వల్ల శక్తి రావడమే కాకుండా నరాల వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది.
- బ్లూ బెర్రీలలో విటమిన్ బి2, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఈ రెండు విటమిన్లు రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయి. దీని వల్ల ఒత్తిడి సందర్భాల్లో నరాలు ప్రశాంతంగా ఉండడం సాధ్యమవుతుంది.
- ఒత్తిడిని తగ్గించడంలో నారింజ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఒత్తిడిగా భావించిన సమయంలో గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగితే రిలాక్స్‌గా అనిపిస్తుంది.
- రోజూ యోగాసనాలు వేయడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి బ్రీతింగ్ వ్యాయామాలు కూడా ఉపకరిస్తాయి.