‘కమలం’ వికసించేలా..

ABN , First Publish Date - 2022-07-02T06:29:39+05:30 IST

హైద్రాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో కమలనాథులు ప్రణాళికబద్ధంగా ముందు కు వెళ్తున్నారు.

‘కమలం’ వికసించేలా..

పార్టీ బలోపేతంపై బీజేపీ కన్ను

సెగ్మెంట్‌లలో ఇన్‌చార్జీల విస్తృత పర్యటనలు

నియోజకవర్గాల్లో జాతీయ నేతల సందడి

ప్రధాని సభకు భారీగా జనం తరలించేందుకు యత్నం

జోరుగా బీజేపీ రాజకీయం

జగిత్యాల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): హైద్రాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో కమలనాథులు ప్రణాళికబద్ధంగా ముందు కు వెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ సభకు ముందు క్షేత్ర స్థాయిలో పార్టీ బలంపై అంచనా, టీఆర్‌ఎస్‌పై ప్రజలల్లో గల అభిప్రాయాలు సేకరించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని వివరించడం లక్ష్యంగా బీజేపీ నేతలు కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల మాదిరిగానే జగిత్యాల జిల్లాలో సైతం అసెంబ్లీ నియోజకవర్గాలపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అ సెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. 

సమన్వయకర్తల నియామకం...

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారిగా జాతీయ, రాష్ట్ర పార్టీ సమన్వయ కర్తలను నియమించారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజ కవర్గాలకు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను కేటాయించారు. వారు ఇప్పటికే ఆయా నియోజకవరాలల్లో విస్తృతంగా పర్యటనలు జరిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక జాతీయ నాయకున్ని, ఒక రాష్ట్ర నాయకుడిని ఇన్‌చార్జీలుగా పంపారు. రెండు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో వీరు పార్టీ సమన్వయ కర్తలతో కలిసి పర్యటిం చారు. కార్యకర్తల ఇళ్లలోనే బస చేశారు.

జిల్లాకు కేటాయించిన ఇన్‌చార్జీలు వీరే...

కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర నేతలతో నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించింది. ఇందుకు గాను నియోజకవర్గాలకు కేంద్రం నుంచి ఒకరిని, రాష్ట్ర నుంచి ఒకరిని బాధ్యులను నియమించారు. జగిత్యాల ని యోజకవర్గానికి కేంద్ర బాధ్యుడిగా డిల్లీకి చెందిన ఎంపీ మనోజ్‌ తివారి, రాష్ట్ర బాధ్యుడిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌, కోరుట్ల నియోజకవర్గానికి కేంద్రం నుంచి గోవాకు చెందిన మాజీ ఎంపీ అనిర్బాన్‌ గంగూలి, రాష్ట్ర బాధ్యుడిగా పాపయ్య గౌడ్‌, ధర్మపురి నియోజకవర్గానికి కేంద్ర బాధ్యునిగా గోవాకు చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాల్‌ నాయక్‌, రాష్ట్ర బాధ్యుడిగా మహబుబ్‌న గర్‌కు చెందిన సుధర్శన్‌ రెడ్డిలను నియమించారు. 

ఆయా అంశాలపై దృష్టి...

ప్రధానంగా నియోజకవర్గాల్లో పర్యటించిన నేతలు పలు అంశాలపై దృ ష్టి సారించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించా రు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని నేతలు అంచనా వేశా రు. అన్ని స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోర్చా విభాగాలతో సమావేశాలు అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అ భివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బీజేపీ చేపట్టిన కా ర్యక్రమాలను మోర్చా విభాగాల కార్యకర్తలకు వివరించారు. రాష్ట్ర బాధ్యు లుగా వచ్చిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అనుబంద కమిటీ లతో సమావేశాలు నిర్వహించారు. ఒక్కో బూత్‌ లెవల్‌ కమిటీలో 20 మంది కార్యకర్తలను సభ్యులుగా ఉంటున్నారు. కిసాన్‌ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా తదితర కమిటీలతో సంబందిత నేతలు సమా వేశమై దిశ నిర్ధేశం చేశారు.

మోదీ సభకు జన తరలింపునకు యత్నం..

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జూలై 3వ తేదీన జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు రావాలంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నా రు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా పోలింగ్‌ బూత్‌ నుంచి 30 మంది చొప్పున ఒక్కో నియోజకవర్గానికి సుమారు 10 వేల మందిని సమీకరించాలని ప్ర ణాళిక రూపొందించారు. ఇంటింటి ప్రచారం చేయడం, కార్యకర్తలను సమన్వయ పరచడం వంటి బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన ఏర్పాట్లపై కమలనాథులు దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో సెగ్మెంట్‌ స్థాయి ఒక్కో అనుబంద కమిటీల స మావేశాలను నిర్వహించారు. బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో కార్యక్రమాలను పకడ్భందీగా అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

బిజీబిజీగా జిల్లా కమలనాథులు...

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ బహి రంగ సభ నేపథ్యంలో జిల్లాలో బీజేపీ నేతలు, అనుబంధ సంఘాల నేత లు, కార్యకర్తలు రెండు, మూడు రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర, రాష్ట్ర నేతలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వ స్తుండడం, ప్రచారం చేస్తుండడం, కార్యకర్తల ఇళ్లలో బస, మారుమూల గ్రామాల సందర్శన, మండలాల్లో అనుబంద సంఘాల నేతలతో సమా వే శాలు, మోర్చా విభాగాలతో చర్చలు తదితర కార్యక్రమాలను నిర్వహి స్తుండడంతో వీటిని సమన్వయం చేయడానికి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు బీజీ అయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చిన జాతీయ, రా ష్ట్ర నేతలకు అవసరమైన భోజన, బస, ప్రయాణ ఏర్పాట్ల వ్యవహారాలను నిర్వర్తిస్తున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ నే తృత్వంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్‌చార్జిలు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంద సంఘాల నేతలు పలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సభలు, సమావేశాలు, సదస్సులు, ప్రచారం విజయవం తం చేయడంతో మోదీ సభకు లక్ష్యం మేరకు జనాన్ని సమీకరించడంపై దృష్టి సారించి ఆ మేరకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. 

అధిష్టానం మార్గదర్శకాల మేరకు...

మోరపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర రాజధానిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పార్టీ జాతీయ, రాష్ట్ర ఇన్‌చార్జీల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నాము. జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా పని చేస్తున్నాము.

బీజేపీ బలోపేతం చేయడానికే...

దొనికెల నవీన్‌, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, 

జగిత్యాల జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేసే విధంగా కార్యాచరణను రూపొందించాము. ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు దిశ నిర్ధేశం జరగనుంది. ప్రధానీ నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నాము. హైద్రాబాద్‌ సభకు లక్ష్యం మేరకు జన సమీకరణ జరుపనున్నాము.


Updated Date - 2022-07-02T06:29:39+05:30 IST