ఇల్లంతా ఆహ్లాదం నిండేలా...

ABN , First Publish Date - 2020-09-07T05:36:37+05:30 IST

ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేసుకుంటే ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు...

ఇల్లంతా ఆహ్లాదం నిండేలా...

ఇప్పుడు చాలామందికి ఇల్లే అఫీసు, జిమ్‌ అయింది. ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేసుకుంటే ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. పాజిటివ్‌ ఆలోచనలు నిండుతాయి. అందుకు ఏం చేయాలంటే...


  • ఆఫీసు వర్క్‌చేసే డెస్క్‌ దగ్గర్లో ఒక ప్రకాశమంతమైన ల్యాంప్‌ ఉంచండి. అలానే చిన్న చిన్న మొక్కలు కొన్ని ఏర్పాటుచేస్తే గదంతా తాజాగా మారుతుంది అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్‌ జతిన్‌ కపూర్‌.

  • పరిమళం వెదజల్లే కొవ్వొత్తులు, ఎయిర్‌ ఫ్యూరిఫయర్స్‌ గదిలో ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తాయి.  లావెండర్‌ లేదా యూకలిప్టస్‌ సువాసన గది మొత్తం విస్తరించి హాయినిస్తుంది.

  • పడక గది రంగుకు మ్యాచ్‌ అయ్యేలా ప్రింటెడ్‌ వాల్‌పేపర్లు, పక్షుల బొమ్మలతో కూడిన హ్యాంగిగ్స్‌ ఏర్పాటుచేస్తే కొత్తదనంతో పాటు ప్రత్యేకంగాను ఉంటుంది.

Updated Date - 2020-09-07T05:36:37+05:30 IST