హెడ్‌ఫోన్లు శుభ్రం చేయండిలా?

ABN , First Publish Date - 2021-09-30T05:30:00+05:30 IST

మాట్లాడేప్పుడు, సంగీతం వినటం కోసం.. ఇయర్‌ ఫోన్లు, హెడ్‌ ఫోన్లు

హెడ్‌ఫోన్లు శుభ్రం చేయండిలా?

మాట్లాడేప్పుడు, సంగీతం వినటం కోసం.. ఇయర్‌ ఫోన్లు,  హెడ్‌ ఫోన్లు వాడుతుంటాం. చెవులపై చాలా సేపు ఉంచటం వల్ల వీటిపై బ్యాక్టీరియా అంటుకుంటుంది.  ఇక బ్యాగులో, ప్యాంట్‌ జేబుల్లో ఉంచడం వల్ల వీటిపై డస్ట్‌ పేరుకుపోతుంది. ఆహార పదార్థాలు, చెమట వల్ల కూడా ఇయర్‌ ఫోన్లు పాడవుతాయి. అందుకే ఎప్పటి కప్పుడు వీటిని జాగ్రత్తగా శుభ్రపరుస్తుండాలి.


 ఇయర్‌ ఫోన్లు చెవుల లోపలికి చొప్పిస్తాం కాబట్టి చెవిలోని బాక్టీరియా వీటిమీద నిల్వ ఉంటుంది. ఈ దుమ్మును ఇయర్‌ బడ్‌తో లేదా మెత్తటి బట్టను శానిటైజర్‌లో ముంచి శుభ్రపరచుకోవాలి. 


 తేమ లేని టూత్‌ బ్రష్‌తో సులువుగా ఇయర్‌ ఫోన్లలో ఉండే మట్టిని తొలగించొచ్చు. ఇక ఇయర్‌ ఫోన్‌ల మీద చెవులకు నొప్పి కలగకుండా ఉండే మెత్తని సిలికాన్‌, రబ్బరు బడ్స్‌ను తీసేయాలి. వాటిని గోరువెచ్చని నీటిలో వేసి సబ్బుతో శుభ్రపరచి ఆరబెట్టుకోవచ్చు. 


 హెడ్‌ ఫోన్ల విషయానికొస్తే.. మెత్తటి ఇయర్‌ ప్యాడ్స్‌ను తీసేసి వాటిని టవల్‌తో తుడిచేయాలి. లేదా మెత్తని బట్టను హ్యాండ్‌ శానిటైజర్‌లో ముంచి శుభ్రపరచాలి. ఇలా కనీసం పదిహేను రోజులకైనా ఈ పరికరాలను శుభ్రపరిస్తే చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావు. 


Updated Date - 2021-09-30T05:30:00+05:30 IST