తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం

ABN , First Publish Date - 2022-05-17T04:26:55+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


పాలమూరు, మే 16: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీపీ ఎం ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లా డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రంలో బీజేపీ విషబీజాలు నాటుతోందన్నారు. ప్రజల్లో అనైక్యత సృష్టించి హిందువుల ఓట్లు దండుకోవాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటమే పనిగా పెట్టుకుందన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో అన్నిరకాల వస్తువుల ధరలు పైపైకి పోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం, దేశవ్యాప్తంగా మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, లిబరేషన్‌తో పాటు, మరో పార్టీతో ఐక్య ఉద్యమాలు, రాష్ట్రంలో తొమ్మిది వామపక్ష పార్టీలతో ఐక్య ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచి పన్ను వేస్తే తెలంగాణ రాష్ట్రానికి వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్‌ పేరుతో ధరలు పెంచుతోందన్నారు. ఉపాధి హామీని ఆన్‌లైన్‌ పేరుతో మోసం చేసి తీసివేయాలని చూడటం దారుణమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందన్నారు. దళితులకు మూడె కరాల భూమి, విద్య, వైద్యం, ఉపాధి చూపడం లేదన్నారు. పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచడం, ఇతర సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం సరికాదన్నారు. అంగన్‌వాడీలకు మేలు చేయాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ, సాగర్‌, రమణ, కిల్లె గోపాల్‌, ఉమ్మడి జిల్లా నాయకులు పర్వతాలు, వెంకటస్వామి, ఎండి.జబ్బార్‌, వెంకట్రామిరెడ్డి, ఏ.రాములు, పద్మ, కె.గీత, నర్మద, ఎన్‌.కురుమూర్తి, చంద్రకాంత్‌, మోహన్‌, ఆంజనేయులు, నరసిం హులు, బాల్‌రెడ్డి, వి.పద్మ తదితరులు పాల్గొ న్నారు. 

Updated Date - 2022-05-17T04:26:55+05:30 IST