ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-16T13:11:44+05:30 IST

లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు వారి రాకపోకలకు వాహనాలు సమకూరుస్తున్న వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు....

ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న వ్యక్తి అరెస్ట్

పుల్వామా (జమ్మూకశ్మీర్): లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు వారి రాకపోకలకు వాహనాలు సమకూరుస్తున్న వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లా చాకూరా పట్టణానికి చెందిన సాహిల్ ఫరూఖ్ మీర్ లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సన్నిహిత అనుచరుడు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతోపాటు వారు రాకపోకలు సాగించేందుకు వాహనాలు కూడా సమకూరుస్తున్నాడు. ట్రాల్, కాక్ పోరా, ఖ్రూ, అవంతిపురా ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సాహిల్ ఫరూఖ్ ఆశ్రయం కల్పించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తుపాకులను రవాణ చేయడంలోనూ ఫరూఖ్ ఉగ్రవాదులకు సహకరించాడని అవంతిపురా పోలీసులు తేల్చారు. ఫరూఖ్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-07-16T13:11:44+05:30 IST