గడపగడపకు రైతు డిక్లరేషన్‌ తీసుకెళ్దాం

ABN , First Publish Date - 2022-05-20T04:43:31+05:30 IST

వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను గ్రామాల్లోని గడపగడపకు తీసుకుపోదామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

గడపగడపకు రైతు డిక్లరేషన్‌ తీసుకెళ్దాం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

- ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి

వనపర్తి టౌన్‌, మే 19: వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను  గ్రామాల్లోని గడపగడపకు తీసుకుపోదామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభు త్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని, అందుకోసం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను ప్రతీ రైతుకు అందించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు  రుణ మాఫీ, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ. 15 వేల ఆర్థిక సహా యం, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతీ ఏడాది రూ. 12 వేలు అందించే గొప్ప పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కరి స్తామన్నారు. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ఈ నెల 21 నుంచి ప్రతీ గ్రామానికి రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ముందుకు సాగాలని, ప్రతీ కార్యకర్త కంకణ బద్దుడై పని చేయా లని సూ చించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం లో టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, ఖమ్మర్‌మియా, కౌన్సిలర్‌ బ్రహ్మం, ఎండీ బాబా,   మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T04:43:31+05:30 IST