Abn logo
Sep 21 2021 @ 00:30AM

సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేద్దాం : టీడీపీ

ములకలేడు ఎంపీటీసీ లింగప్పను సన్మానిస్తున్న ఉమామహేశ్వరనాయుడు

కళ్యాణదుర్గం, సెప్టెంబరు20: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ని సమష్టి కృషితో మరింత బలోపేతం చేద్దామని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ ఫలితాల్లో శెట్టూరు మండలం ములకలేడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జీఎల్‌ లింగప్ప ఘనవిజయం సాధించాడు. సోమవారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో లింగప్పను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కేక్‌కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ పార్టీ జెండాలో పనిచేస్తే ఎప్పటికైనా సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఇదివరకు నాయకులకు పార్టీ పదవు లు వరించడం ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ నాయకత్వంలో పనిచేయడం మ న అదృష్టమన్నారు. 

           

  వారి ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చే సి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేద్దామన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను చూసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీ పీ బహిష్కరించిందన్నారు. అయినప్పటికి వైసీపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చి గెలుపొందడం హర్షనీయమన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ మాదినేని మురళి, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రామరాజు, పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లప్ప, పార్లమెంట్‌ కార్యదర్శి తలారి సత్యప్ప, మాజీ మండల కన్వీనర్‌ టీఆర్‌ తిప్పేస్వామి, నాయకులు నగేష్‌, రంగనాథ్‌శెట్టి, పోస్టు పాలన్న, తిమ్మసముద్రం వెంకటేశులు, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పర్వతనేని మధు, నియోజకవర్గ అధ్యక్షుడు ఆదిమూలం మంజు, నాగరాజు, బిక్కి గోవిందరాజులు, విరుపాక్షి, గిరి, శ్రీనివాసులు, బొమ్మన్న, బోగేష్‌, హనుమంతరాయుడు, నారాయణయాదవ్‌, చ క్రపాణి, నారాయణస్వామి, జగదీష్‌, నరసింహులు, రామకృష్ణ, తిమ్మప్ప, హరి, మల్లయ్య, రాము, హనుమేష్‌, కిరణ్‌, గోవిందు, హరీష్‌, సుధాకర్‌, శ్రీ కాంత, వంశీ పాల్గొన్నారు.