సమైక్యతను చాటుదాం

ABN , First Publish Date - 2022-08-13T05:26:37+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురష్కరించుకుని దేశ సమైక్యతను చాటుదామని ముస్లిం నాయకులు పిలుపునిచ్చారు.

సమైక్యతను చాటుదాం
జిల్లా కేంద్రంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు

వనపర్తి టౌన్‌, ఆగస్టు 12: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురష్కరించుకుని దేశ సమైక్యతను చాటుదామని ముస్లిం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని అన్ని మసీదుల ఇమామ్‌లు, మైనారిటీ యువకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వ హించారు. జాతీయ గీతాలాపానలతో సాగిన ర్యాలీ సందర్భంగా అంబేడ్కర్‌, గాంధీజీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ  ప్రతీ పౌరుడు దేశ సమైక్యతను సగర్వంగా చాటాలని, ప్రతీ ఇంటి పై మువ్వన్నెల జెండాను బాధ్యతగా ఎగురవేయాల న్నారు.  కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అఫ్జల్‌ మియా, కమ్మర్‌ మియా, ఎండీ రహీం, ఎండీ బాబా, అక్తర్‌, అనీస్‌, యాకూబ్‌, జోయాబ్‌, అలీమ్‌, అస్లం, కలీల్‌, ఫజల్‌, కౌన్సిలర్‌ సమ్మద్‌ పాల్గొన్నారు. 

పెబ్బేరులో...

పెబ్బేరు : భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని వివిధ పార్టీల నాయకులు అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవ త్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుక్రవా రం పెబ్బేరు జామా మసీదు మైనార్టీ కమిటీ ఆధ్వ ర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చౌరస్తాలో పలువురు నాయకులు మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగ ఫలితమే స్వతంత్రమని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, వైస్‌చైర్మన్‌ కర్రెస్వామి, ఎల్లారెడ్డి, ముస్తాక్‌, కాంగ్రెస్‌ నాయకులు విజయవర్ధ్దన్‌రెడ్డి, బీజేపీ నాయకులు వేమారెడ్డి, కంచె ఆంజనేయులు, బీఎస్పీ నాయకులు ఘనపురం కృష్ణ, సీపీఎం నాయ కులు పెద్దఖాజా, ఏంఐఎం నాయకులు ఆఫ్రోజ్‌, గంధం రంజిత్‌కుమార్‌, జగదీశ్వర్‌రెడ్డి, సత్యనారాయ ణ, ఎండీ షకీల్‌, బషీర్‌, పాతపల్లి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోటలో...

కొత్తకోట :స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురష్కరిం చుకొని పట్టణంలో ముస్లిం నాయకులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం మీసీదు లలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం జాతీయ జెండా లు చేతపట్టి హిందుస్తాన్‌ హామారా హై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయ కులు లతీఫ్‌, సుల్తాన్‌, ఖాజామైనోద్దీన్‌, రహీం, అబ్దు ల్‌ గఫార్‌, సలీంఖాన్‌, సాజీద్‌అలా, వహిద్‌అలీ, మౌలాన అబిద్‌ హుసేన్‌, ఖాజ్మీ, సయ్యద్‌లాల్‌, హఫీజ్‌, మహమ్మద్‌ హుల్‌ ఉసేన్‌, ఖాజీ మహమద్‌ షఫీ, మోయినోద్దీన్‌, బాబా, మతీన్‌ పాల్గొన్నారు. 

చిన్నంబావిలో..

చిన్నంబావి: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్క రించుకుని కొప్పునూరు గ్రామంలో ఇంటింటికి జాతీ య జెండాలను పంపిణీ చేశారు. జాతీయ జెండాను ప్రతి ఇంటి పై ఆవిష్కరించి దేశ సమైఖ్యతను చాటి చెప్పాలని సర్పంచ్‌ కౌసల్య  అన్నారు.  కార్యక్రమం లో ఉప సర్పంచ్‌ ఆనంద్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ డేగశేఖర్‌ యాదవ్‌, పంచాయతీ సెక్రటరీ రమేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కురుమూర్తి పాల్గొన్నారు. 

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌ : రాష్ట్ర  ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రో త్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని అన్నారంతండా, చిక్కేపల్లి గ్రామాల్లో సర్పంచులు రంగనాయక్‌, ముంత బాలస్వామి ఇంటింటికి జాతీ య జెండాలను పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు.  నేటి తరం పిల్లలు స్వాతంత్య్రంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయత ను చాటాలన్నారు. 

పెద్దమందడిలో..

పెద్దమందడి :  వజ్రోత్సవ వేడుకలను కేంద్రం ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఇందులో భా గంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మండలంలోని వీరాయిపల్లిలో  576 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై జాతీయ జెండా ఎగరవేశారు. స్వతంత్ర భారతవాని కోసం ప్రాణ త్యా గాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధ్దికి ప్రతీ ఒక్కరు పాటు పడాలని ఎస్‌ఐ హరిప్రసాద్‌ అన్నా రు. యువత మహనీయులను ఆదర్శంగా తీసుకో వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌, కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్థులు, పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో...

ఆత్మకూర్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా ఆత్మకూర్‌ పట్టణ కేంద్రంలోని ముస్లింలు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కో ఆప్షన్‌ సభ్యులు రియాజ్‌ మాట్లాడుతూ వజ్రో త్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ పౌరుడు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 

అమరచింతలో...

అమరచింత: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్క రించుకుని శుక్రవారం అమరచింతలో బీజేపీ శ్రేణు లు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశా రు. పట్టణంలోని 1,2,3,4,8, వార్డులలోని ప్రజల దగ్గరికి వెళ్లి భారత వజ్రోత్సవాల ప్రత్యేకతను వివ రించారు. ఇంటింటికి త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్‌, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మేర్వ రాజు, బీజేపీ నాయకులు అనిల్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రవీణ్‌ సాగర్‌, పారుపల్లి సురేష్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-13T05:26:37+05:30 IST