Abn logo
Sep 24 2021 @ 23:45PM

ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకుందాం

ప్రసంగిస్తున్న టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.యం ఖలీల్‌

- 27న భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలి

-  రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల పిలుపు


పాలమూరు, సెప్టెంబరు 24 : రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చే యాలని, ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించుకుందామని రౌండ్‌టేబుల్‌ సమా వేశంలో వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎఫ్‌ టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.విజయ్‌కుమార్‌ అధ్యక్షతన ఈనెల 27న భారత్‌ బంద్‌పై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలు ప్రజాసం ఘాల నాయకులు ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భంధంతో ప్రజ ల గొంతులు, నిరసన గళాలను అణచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసి కార్పోరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నారని తెలిపారు. అనంతరం బంద్‌ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.యం ఖలీల్‌, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ యం.రాఘవాచారి, ఆర్‌టీసీ టీయంయూ నాయకులు నాగేంద్ర, ఐఎన్‌టీయూసీ కార్యదర్శి రాములుయాదవ్‌, డీటీఎఫ్‌ నాయకులు వామన్‌కుమార్‌, విద్యావంతులవేదిక సతీష్‌కుమార్‌, ఆల్‌ మేవా కార్యదర్శి ఫరూఖ్‌హుస్సేన్‌, గడ్డమీదిగోపాల్‌, ఖాలీద్‌నవీద్‌, చైతన్య మహి ళా సంఘం నాయకులు శ్రీదేవి, టీపీఎఫ్‌ బుచ్చారెడ్డి, మన్నెం, రాజు, యం ఆర్‌జేఏసీ నాయకులు హనీఫ్‌అహ్మద్‌, స్వీపర్ల సంఘం ఆధ్యక్షులు సాయన్న, రాంచందర్‌, జలాల్‌పాషా ప్రసంగించారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధికసంఖ్యలో బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.