దోమలు పుట్టకుండా చేద్దాం

ABN , First Publish Date - 2022-05-17T05:16:08+05:30 IST

దోమలు పుట్టకుండా చేయాలని, ఇందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం రాయచోటి మండలం యండపల్లె పీహెచ్‌సీ పరిధిలోని బోయపల్లెలో వైఎ్‌సఆర్‌ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వీధుల్లో తిరుగుతూ పలు సూచనలు చేశారు.

దోమలు పుట్టకుండా చేద్దాం
రామాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యాధికారులు

జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌

రాయచోటిటౌన్‌, మే 16: దోమలు పుట్టకుండా చేయాలని, ఇందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం రాయచోటి మండలం యండపల్లె పీహెచ్‌సీ పరిధిలోని బోయపల్లెలో వైఎ్‌సఆర్‌ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వీధుల్లో తిరుగుతూ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రాయచోటి మలేరియా కేంద్రం ఆరోగ్య విస్తరణాధికారి జయచంద్ర, యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణాధికారి వేణుగోపాల్‌రెడ్డి, మహిళా సూపర్‌వైజర్‌ రవణమ్మ, హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


రామాపురంలో: లార్వాను వృద్ధి కాకుండా అంతం చేయాలని మండల వైద్యాధికారులు విజయ్‌కుమార్‌, వినోద్‌కుమార్‌లు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మూడు రోడ్ల కూడలి మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమ గుడ్లు పెట్టడం ద్వారా లార్వా ఉత్పత్తి అవుతుందని, దాన్ని అంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీహెచ్‌వో ఎలియాజర్‌, లక్కిరెడ్డిపల్లె సబ్‌ యూనిట్‌ అధికారి ప్రసాద్‌యాదవ్‌, పీహెచ్‌ఎన్‌ విజయ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాఘవ, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 


నందలూరులో : చేయి చేయి కలుపుదాం - డెంగ్యూను నివారిద్దామని మండల ప్రభుత్వ అధికారి సృజన పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సీహెచ్‌వో టీవీ నారాయణ, పీహెచ్‌ఎన్‌ మేరీ, సూపర్‌వైజర్లు శోభన్‌బాబు, హిమశంకరి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:16:08+05:30 IST