జాతి నిర్మాణంలో భాగస్వాములవుదాం

ABN , First Publish Date - 2022-08-16T08:46:35+05:30 IST

విధులు నిర్వర్తించే ప్రదేశం ఆరాధన స్థలంతో సమానమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు.

జాతి నిర్మాణంలో భాగస్వాములవుదాం

స్వాతంత్య్ర వేడుకల్లో హైకోర్టు సీజే

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): విధులు నిర్వర్తించే ప్రదేశం ఆరాధన స్థలంతో సమానమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. అంకితభావం, చిత్తశుద్ధి, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించి దేశ నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర  వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా జాతీయ జెండా ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీజే మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు తమ త్యాగాల ద్వారా ప్రసాదించిన రాజ్యాంగం అనే అమృతాన్ని ప్రతి పౌరుడికీ చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ నిర్మాణంలో న్యాయవ్యవస్థ తనవంతు కృషి చేయాలన్నారు. జాతి నిర్మాణంలో పాలుపంచుకోవడం అంటే పత్రికల్లో ఫొటోలకే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జనకిరామిరెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)ఎ్‌స.శ్రీరామ్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T08:46:35+05:30 IST