ప్లాస్టిక్‌ రహిత జడ్చర్లగా తీర్చిదిద్దుదాం

ABN , First Publish Date - 2022-06-30T05:08:54+05:30 IST

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించి, ప్లాస్టిక్‌ రహిత జడ్చర్లగా తీర్చిదిద్దుదామని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌ రహిత జడ్చర్లగా తీర్చిదిద్దుదాం
ప్లాస్టిక్‌ను వాడొద్దంటూ ర్యాలీ నిర్వహించిన మునిసిపల్‌ పాలకవర్గం, అధికారులు

- సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం - మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి

జడ్చర్ల, జూన్‌ 29 : సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించి, ప్లాస్టిక్‌ రహిత జడ్చర్లగా తీర్చిదిద్దుదామని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి పిలుపునిచ్చారు. జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేసి, చేతి సంచులను వినియోగిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ కవర్లు కనిపించి నా, వినియోగించినా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్‌ పాలాది సారిక, కౌన్సిలర్లు, కమిషనర్‌ మహమూద్‌ షేక్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:08:54+05:30 IST