‘బాల్క సుమన్‌ బెదిరింపులు తట్టుకోలేకనే పార్టీని వీడాం ’

ABN , First Publish Date - 2022-05-23T04:03:03+05:30 IST

ప్రభుత్వ విప్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేకనే కాంగ్రెస్‌ పార్టీలో చేరా మని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలి పారు. ఆదివారం రెండో జోన్‌ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓదెలు మాట్లాడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ విప్‌గా పనిచేసిన తనకు 2018లో టికెట్‌ ఇవ్వకపోవడంతో అవమానాన్ని దిగ మింగుకున్నానని తెలిపారు. తన సతీమణి జడ్పీ చైర్‌పర్సన్‌ టికెట్‌ ఇచ్చినా ప్రోటోకాల్‌ లేకుండా పోయిందన్నారు.

‘బాల్క సుమన్‌ బెదిరింపులు తట్టుకోలేకనే పార్టీని వీడాం ’
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి

మందమర్రిటౌన్‌, మే 22: ప్రభుత్వ విప్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేకనే కాంగ్రెస్‌ పార్టీలో చేరా మని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలి పారు. ఆదివారం రెండో జోన్‌ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓదెలు మాట్లాడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ విప్‌గా పనిచేసిన తనకు 2018లో టికెట్‌ ఇవ్వకపోవడంతో అవమానాన్ని దిగ మింగుకున్నానని తెలిపారు. తన సతీమణి జడ్పీ చైర్‌పర్సన్‌ టికెట్‌ ఇచ్చినా ప్రోటోకాల్‌ లేకుండా పోయిందన్నారు. కొందరు బాల్క సుమన్‌ అనుచరులు  బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. నన్ను మందమర్రి విడిచి పెట్టి వెళ్లాలని చెప్పా రని, ఇది ఎంత వరకు సబబన్నారు. తనకు, తన భార్యకు జరుగుతున్న అవమానాలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు.    తాను బతికినా, చచ్చినా ఇక్కడే ఉంటానని, ఎక్కడ నుంచో వచ్చిన వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ వేధింపులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, సొత్కు సుదర్శన్‌,  వెంకటస్వామి, కడారి వీరస్వామి, ప్రభాకర్‌, హఫీజ్‌ఉర్‌ రహెమాన్‌, బద్రి, ఆలం శంకర్‌, మేకల శంకర్‌, కత్తెర్ల సంజీవ్‌, సాయికృష్ణ, పాల్గొన్నారు. 

పార్టీకి రాజీనామా.. చైర్‌పర్సన్‌కు కాదు 

తాను టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, చైర్‌పర్సన్‌ పదవికి కాదని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు స్పష్టం చేశారు. ఆది వారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎందరో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, వారందరు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిస్తే తాను కూడా రాజీనామా చేస్తానని తెలిపారు.  పార్టీ మారినా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. 

Updated Date - 2022-05-23T04:03:03+05:30 IST