ఏరియా ఆస్పత్రిని..వదులుకోం!

ABN , First Publish Date - 2022-04-23T05:38:10+05:30 IST

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటులో రాజాం పట్టణానికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. చీపురుపల్లికి డివిజన్‌ కేంద్రం కేటాయించింది. దీంతో రాజాం నియోజకవర్గ ప్రజలకు నిరాశ ఎదురైంది. అది మరువక ముందే రాజాం ఏరియా ఆస్పత్రిని చీపురుపల్లికి తరలిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా... సుదీర్ఘ కాలం శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో రాజాం పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటుచేయాలని ఈ ప్రాంతీయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యాధికులు, వివిధ రంగాల ప్రముఖులు జేఏసీగా ఏర్పడి పోరాడారు

ఏరియా ఆస్పత్రిని..వదులుకోం!
రాజాం ఏరియా ఆస్పత్రి

చీపురుపల్లికి తరలించాలని ప్రయత్నం?

ఆందోళనలో రాజాం నియోజకవర్గ ప్రజలు

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

పోరాటానికి సన్నద్ధం

(రాజాం)

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటులో రాజాం పట్టణానికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. చీపురుపల్లికి డివిజన్‌ కేంద్రం కేటాయించింది. దీంతో రాజాం నియోజకవర్గ ప్రజలకు నిరాశ ఎదురైంది. అది మరువక ముందే రాజాం ఏరియా ఆస్పత్రిని చీపురుపల్లికి తరలిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా... సుదీర్ఘ కాలం శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో రాజాం పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటుచేయాలని ఈ ప్రాంతీయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యాధికులు, వివిధ రంగాల ప్రముఖులు జేఏసీగా ఏర్పడి పోరాడారు ప్రముఖ పారిశ్రమిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు సహితం డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. కానీ ప్రభుత్వం కనీస పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై స్థానికులు బాధతతో ఉన్న తరుణంలో సుమారు 10 మండలాల ప్రజలకు వైద్యసేవలందిస్తున్న ఏరియా ఆస్పత్రిని చీపురుపల్లికి తరలించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యమ బాట పట్టడానికి రాజాం ప్రాంతీయులు సిద్ధపడుతున్నారు. 

 మెరుగైన సేవలు

రాజాం ఏరియా ఆస్పత్రిలో 14 మంది వైద్యులతో పాటు దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు సగటున 300 నుంచి 400 మంది ఓపీ ఉంటుంది. నిత్యం ఔట్‌ పేషెంట్‌ విభాగం రోగులతో కిక్కిరిసి ఉంటుంది. నెలకు సగటున కుటుంబ నియంత్రణ, ఇతర ఆపరేషన్లు 100 వరకూ జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. 2013లో సీహెచ్‌సీగా ఉన్న ఆస్పత్రిని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి వసతులు మెరుగుపరిచారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆస్పత్రిని రోగుల ఓపీ, ఆపరేషన్లు తక్కువ ఉన్నాయని సాకు చూపి చీపురుపల్లికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాత్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ప్రకటించకపోయినా, ఇప్పుడు ఆస్పత్రిని తరలించే ప్రయత్నం చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే జోగులుతో పాటు ఇతర అధికార ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఏరియా ఆస్పత్రిని తరలించకుండా నియంత్రించాల్సిన అవసరముంది. 


పోరాటానికి సిద్ధం

సీహెచ్‌సీగా ఉన్న ఆస్పత్రి దుస్థితిని అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయించాను. గతం కంటే వైద్యసేవలు మెరుగుపడ్డాయి. పది మండలాల ప్రజలకు మెరుగైన సేవలందుతున్నాయి. ఈ సమయంలో ఆస్పత్రిని తరలిస్తామనడం అన్యాయం. దీనిపై పోరాటానికి సిద్ధం. 

- కోండ్రు మురళీమోహన్‌, మాజీ మంత్రి,


నిర్ణయం సరికాదు.

నిరుపేద, మద్యతరగతి కుటుంబాలకు ఆస్పత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంది. మెరుగైన సేవలందిస్తోంది. చీపురుపల్లి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం సరికాదు. అటువంటి ప్రయత్నంను విరమించుకోవాలి.

- వారణాసి గౌరమ్మ , పట్టణవాసి, రాజాం 





Updated Date - 2022-04-23T05:38:10+05:30 IST