పోలీసులకు దొంగల సవాల్‌...!

ABN , First Publish Date - 2021-09-29T06:34:33+05:30 IST

కొవిడ్‌ చేసిన నష్టంతో అల్లాడుతున్న ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

పోలీసులకు దొంగల సవాల్‌...!

పట్టుకోండి చూద్దాం..

పోలీసులకు దొంగల సవాల్‌...!

జిల్లాలో పెరుగుతున్న చోరీలు

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం

కొన్ని ప్రాంతాలలో పట్టపగలే చోరీలు

భయాందోళనలో జిల్లా ప్రజలు

పోలీసు నిఘా వైఫల్యం

అనంతపురం క్రైం, సెప్టెంబరు 28 :  కొవిడ్‌ చేసిన నష్టంతో అల్లాడుతున్న ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. జిల్లాలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతుండటం జిల్లా ప్రజలను వణికిస్తోంది.  కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు దొంగలు పడుతున్నారు. పోలీసులు చోరీల కేసులపై ఆశించిన స్థాయిలో నిఘా ఉంచకపోవడంతో యఽథేచ్ఛగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చోరీ కేసుల రికవరీ కూడా అంతంతే ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 


  పెరుగుతున్న చోరీలు..

జిల్లాలో రోజురోజుకు దొంగతనాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. దుండగులు కూడా పథకం ప్రకారం ముందస్తు రెక్కి నిర్వహించి చోరీలకు బరితెగిస్తున్నారు.  కొవిడ్‌తో పాటు వినాయక నిమజ్జనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ తదితర నేపథ్యంలో పోలీసు  నిఘా కూడా పూర్తిగా తగ్గిపోయింది.  దొంగలు కూడా ఇదే అదనుగా భావించి పల్లె పట్టణం అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు దోచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడటం మరింత కలవరం రేపుతోంది. దీంతో ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లాలంటే జనం భయాందోళన చెందాల్సి పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు బాధిత ప్రజల ఫిర్యాదు చేసినా  కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం నగరంతో పాటు గుంతకల్లు, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, తదితర ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. 


పాత నేరస్థుల పనేనా..?

జిల్లాలో విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతుండటంతో తగ్గించడానికి కొన్నేళ్ల కిందట జిల్లా పోలీసు యంత్రాంగం సుమారు 2862 మందిని పాత నేరస్థులుగా(దొంగలుగా) గుర్తించింది. ఈ క్రమంలో ఒక దొంగ.. ఒక పోలీసు అనే కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత పాత నేరస్తులు దొంగతనాలకు పాల్పడకుండా పోలీసులు నిఘా ఉంచారు. తద్వారా జిల్లాలో చోరీలు కొంతవరకూ తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత ఒక దొంగ.. ఒక పోలీసు పూర్తిగా అటకెక్కించారు. ఆయితే కొవిడ్‌ రావడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పాత నేరస్థులు  కూడా కూలి తదితర చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిం చేవారు. ఈ క్రమంలో పనులు, వ్యాపారాలు లేకపోవడంతో వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో తిరిగి  చోరీలకు తెరలేపినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో జిల్లాలో గత కొంతకాలంగా నమోదైన చోరీలను పరిశీలిస్తే పాత నేరస్తుల సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు బయటపడింది.  


కనిపించని పోలీసు నిఘా...

జిల్లాలో గత కొంతకాలంగా దొంగలు హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు చొరపడి దోచేస్తున్నారు. దొంగతనాలు తగ్గించడం.. దొంగల ఆటకట్టించడం కోసం పోలీసుశాఖ అమలు చేస్తున్న ఎల్‌ఎంహె చఎ్‌స(లాక్డ్‌హౌ్‌స మానటరింగ్‌ సిష్టమ్‌) యాప్‌ సేవలను ప్రజలు ఆశించిన స్థాయిలో వినియోగించుకోకపోవడం దొంగలకు కలిసివస్తోంది. 


పోలీసులు కూడా కొన్ని ప్రధాన కూడళ్లు, వీధుల్లో మాత్ర మే రాత్రి 11 గంటల వరకు గస్తీ నిర్వహిస్తూ తర్వాత మిన్నుకుండిపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దొంగతనాలకు అనువుగా ఉండే ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏమాత్రం కనిపించడం లేదనే విమర్శలు  వినిపిస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసినా కొందరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే త్వరతిగతిన కేసును పరిష్కారించాల్సి ఉంటుందని కాలయాపన చేస్తున్నారని సమాచారం. మరికొందరు పోలీసులైతే  వివిధ పనులతో బిజీగా ఉన్నామని చెప్పి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ప్రత్యేక నిఘా ఉంచుతాం 

జిల్లాలో దొంగతనాలు జర గకుండా ప్రత్యేక నిఘా ఉంచు తాం. పాత నేరస్థులే ఎక్కువగా చోరీలకు పాల్పడుతున్నట్లు వివిధ కేసులలో బయటపడింది. ఎక్కడికక్కడ గస్తీ ముమ్మరం చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల పోలీసులను మరింత అప్రమత్తం చేసి దొంగతనాలు జరగకుండా చూస్తాం. ఎవరైనా పోలీసులు చోరీల కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. దొంగతనాలు జరగకుండా ఎల్‌ఎంహెచ ఎస్‌ సేవలను ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. 

- ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప



చైనస్నాచర్ల హల్‌ చల్‌

ఒంటరి మహిళలే లక్ష్యంగా నేరాలు 

 ఆందోళనలో ప్రజలు 

 దృష్టిసారించని పోలీసులు

నగరంలో చైనస్నాచర్‌లు(గొలుసు దొంగలు) హల్‌చల్‌ చేస్తున్నారు. ఒంటిరి మహిళలు కనిపిస్తే చాలు  రయ్‌మని బైక్‌లో వచ్చి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉ డాయిస్తున్నారు.  కొందరు చైన స్నాచర్లు పోలీసుల కు చిక్కకుండా ఎవరికీ అను మానం రాకుండా హెల్మట్‌లు, మాస్క్‌లు ధరించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా లాక్కొని అలా క్షణాల్లో మాయమవుతున్నారు. ఇందుకు నగరంలో ఇటీవల జరుగుతున్న సంఘటనలే నిదర్శనం. పోలీసుల నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉండటంలో చైనస్నాచర్లు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తరచూ చైనస్నాచింగ్‌లు జరు గుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


జనాల మధ్య ఉంటూనే....

చైనస్నాచర్లు తెలివిగా, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జనాల మధ్యనే ఉంటూ స్నాచింగ్‌లకు పాల్పడుతుండటం ఇటు పోలీసులు, అటు బాధితులను కలవరపె డుతోంది. నిత్యం ప్రజలలోనే తిరుగుతూనే  ఒంటరి మ హిళల కదలికలపై నిఘా ఉంచుతారు. తర్వాత పథకం ప్రకారం అదను చూసి ఒంటరి మహిళ కనబడగానే బంగారు గొలుసు లాక్కొని ఉడాయిస్తారు. దీంతో బాధిత మహిళలు మిన్నకుండిపోవాల్సిన దుస్థితి. పైగా మహిళలు ఎదురు తిరగలేరనే భావనతో చైనస్నాచర్లు  బరి తెగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో కొందరు మహిళలు ఎదురుతిరగడంతో దుండగులు దాడి చేసి మరీ చైనస్నాచింగ్‌లకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. పోలీసు నిఘా లేని ప్రాంతాలు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైనస్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని సమాచారం. 


జిల్లా వ్యాప్తంగా అంతే...

గొలుసు దొంగలు ఒక్క అనంతపురం నగరంలో మాత్రమే కాదు జిల్లాలోని హిందూపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, ధర్మవరం పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో సైతం చెలరేగిపోతున్నారు. దీంతో ఎక్కడైనా ఫంక్షనలు, ఇతర వేడుకలకు బంగారు నగలు ధరించి రావాలంటేనే జంకాల్సిన దుస్థితి ఏర్పడిందని కొందరు బాధిత మహిళలు వాపోయారు. ఎక్కువగా దే వాలయాలు, పట్టణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు బరితెగిస్తుండటం బాధితులతో పాటు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 


 పోలీసు నిఘా అంతంతే...

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పలు దొం గతనాలు, దోపిడీల నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘాతో పాటు గస్తీ చేపట్టా రు. రాత్రి వేళల్లో కూడా అక్కడక్కడ పోలీసు జీపులు తి రుగుతున్నాయి.  కానీ ఆశించిన స్థాయిలో పోలీసులు భద్రత కల్పించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో తరచూ గొలుసు దొంగతనాలు జరుగుతుండట మే ఇందుకు అద్దంపడుతోంది. కనీసం గొలుసు దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు అవగాహన కల్పించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో జనసాంద్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్‌తో పాటు నిఘా మరింత విస్తృతం చేస్తే తప్ప దొంగతనాలకు అడ్డుకట్టపడే పరిస్థితి కనిపించడం లేదు.  పోలీసులు గొలుసు దొంగత నాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా నిఘా విస్తృతం చేయడంతో పాటు పట్టణ, పట్టణ శివారు ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం  ఉంది.   

Updated Date - 2021-09-29T06:34:33+05:30 IST