ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేద్దాం

ABN , First Publish Date - 2022-08-10T05:42:08+05:30 IST

ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేద్దాం

ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేద్దాం
షాద్‌నగర్‌లో జెండాలను పంపిణీ చేస్తున్నమున్సిపల్‌ మాజీ చైర్మన్‌ విశ్వం, కౌన్సిలర్‌ విశాల

కందుకూరు/ఆమనగల్లు/కడ్తాల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/ షాద్‌నగర్‌/ఇబ్రహీంపట్నం/కొత్తూర్‌/శంషాబాద్‌/ చేవెళ్ల, ఆగస్టు 9: ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయతను చాటుకుందామని కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల పరిషత్‌లో ఎంపీడీవో వెంట్రాములు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యదర్శులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఎన్నటికీ గుర్తుండేలా 15 రోజుల సంబరాలను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో విజయలక్ష్మి, సొసైటీ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, బి.కృష్ణరాంభూపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు రాములు, యాదయ్య, సర్పంచ్‌ శ్రీనివాస్‌, అశోక్‌ పాల్గొన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌లోని సినిమా థియేటర్లలో విద్యార్థుల కోసం గాంధీ సినిమాను ప్రదర్శించారు. కడ్తాలలో సినిమా విరామ సమయంలో జర్పుల రాధాకృష్ణ, గంప లక్ష్మయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ల ద్వారా పండ్లు, వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్‌ జడ్పీటీసీ దశరథ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ అందజేశారు. సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, బీచ్యనాయక్‌, నర్సింహ, ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐలు ధర్మేశ్‌, హరిశంకర్‌గౌడ్‌ ఉన్నారు. పట్టణం లో ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని షాద్‌నగర్‌ బీజేపీ ఇన్‌చార్జి శ్రీవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటా జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. ప్రజల్లో జాతీయతా భావాన్ని, ఐక్యతను పాడుకొల్పేందుకు ప్రభుత్వాలు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయన్నారు. 12న యువమోర్చా బైక్‌ ర్యాలీలు, 13న బీజేపీ కార్యకర్త ఇళ్లపై జాతీయ జెండాలావిష్కరణ, 14న సమరయోధు ల విగ్రహాల వద్ద జెండావిష్కరించి, 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. సమావేశంలో నాయకులు అందె బాబయ్య, మహేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌, భూపాలచారి, మనోహార్‌రెడ్డి, నర్సింహాగౌడ్‌, నర్సింహ యాదవ్‌, వెంకటేష్‌, రుషికేష్‌, వంశీకృష్ణ, లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాల పంపిణీ నిర్వహిస్తున్నారు. 23వ వార్డులో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అగ్గునూరి విశ్వం, కౌన్సిలర్‌ విశాల జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చే పట్టారు. ఆగస్టు 15న జాతీయ జెండాను ఆవిష్కరించి భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం 22వ వార్డులో జరిగి న కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, కమిషనర్‌ యూసుఫ్‌ జెండాలను పంపిణీ చేశారు. 21వ వార్డులో కౌన్సిలర్‌ మంగజగదీశ్వర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ అశోక్‌ జెండాలు పంపిణీ చేశారు. నాయకులు జగదీశ్వర్‌, రవీందర్‌, అస్లాం పాల్గొన్నారు. కొత్తూర్‌ మున్సిపాలిటీలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, కమిషనర్‌ వీరేందర్‌ పాల్గొన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీ 23వ వార్డులో కౌన్సిలర్‌ స్రవంతి శ్రీకాంత్‌రెడ్డి  బస్తీలో వజ్రోత్సవాలను ప్రారంభించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఆవిష్కరించాలన్నారు. బస్తీవాసులకు జెండాలు అందజేశారు. కవితాప్రసాద్‌, పవన్‌గౌడ్‌, నామాచంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, జైహింద్‌రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 13వ తేదీ వరకు దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాస్‌లు ఇస్తామని వికారాబాద్‌ డిపో మేనేజర్‌ మహేశ్‌ తెలిపారు. చేవెళ్ల బస్‌స్టాండ్‌లో సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బస్‌స్టేషన్‌ కంట్రోలర్‌ రవీందర్‌, గణేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ వసంత్‌, బస్‌పాస్‌ కౌంటర్‌ ఇన్‌చార్జి గోపాల్‌, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:42:08+05:30 IST