వెళ్లొస్తాం

ABN , First Publish Date - 2022-01-19T04:38:57+05:30 IST

సంక్రాంతికి జిల్లాకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పండగ రోజుల్లో గడిపిన ఆనందం, మధుర స్మృతులను మనసులో పదిలపర్చుకుని ఉపాధి బాట పట్టారు. వారంతా జిల్లా కేంద్రానికి రావడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి.

వెళ్లొస్తాం
బస్సు వద్దకు చేరుకున్న ప్రయాణికులు

 జిల్లా వాసుల తిరుగు ప్రయాణం

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవ రి 18 : సంక్రాంతికి జిల్లాకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పండగ రోజుల్లో గడిపిన ఆనందం, మధుర స్మృతులను మనసులో పదిలపర్చుకుని ఉపాధి బాట పట్టారు. వారంతా జిల్లా కేంద్రానికి రావడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. పండగకు జిల్లాకు రావడానికి ఎంత ప్రయాస పడ్డారో తిరిగి వెళ్లడానికీ అదే స్థాయిలో అవస్థలు పడుతున్నారు. బస్సుల్లో సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు థర్డ్‌వేవ్‌ పొంచి ఉన్నా భౌతిక దూరం పాటించలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో బస్సులో 60 నుంచి 80 మంది వరకూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహుకులు అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణ రోజుల్లో విజయవాడకు రూ.550 టిక్కెట్‌ ధర ఉండగా... ప్రస్తుతం రూ.700 నుంచి రూ.900 వరకూ వసూలు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-19T04:38:57+05:30 IST