Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 05:27:31 IST

ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించే వరకూ పోరాడుదాం

twitter-iconwatsapp-iconfb-icon
ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించే వరకూ పోరాడుదాం

ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం

జగన్‌ది తుగ్లక్‌ నిర్ణయం: రఘురామకృష్ణరాజు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) ‘తెలుగువారికి ఆత్మ గౌరవాన్ని తీసుకువచ్చిన ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం ఈరోజు నడివీధిలో ఉంది. ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వారందరిపై ఉంది. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించే వరకు శాంతియుత పద్థతిలో పోరాడుదాం’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఈ విషయమై తక్షణమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాగద్వేషాలకు, బంధుప్రీతికి అతీతంగా వ్యవహరిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై త్వరలోనే యూజీసీ చైర్మన్‌ను కలిసి చర్చిస్తానని తెలిపారు. ‘నేను శాశ్వత అధ్యక్షున్ని కాదు బాబోయ్‌’ అని  కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చెప్పినట్టుగానే, హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. జగన్‌ది తుగ్లక్‌ నిర్ణయమని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ అడిగినట్లుగా వివరణ ఇవ్వకపోతే పార్టీ గుర్తింపు రద్దవుతుందని చెప్పారు. పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తూ, జీవితకాల అధ్యక్షునిగా జగన్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జూలై 9న విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తల, మీడియా క్లిప్పింగులతో జూలై 11న కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులతో భేటీ అయ్యానని తెలిపారు. తాను లేవనెత్తిన ప్రశ్నలపై, ఎన్నికల కమిషన్‌ తమ పార్టీ నాయకత్వాన్ని వివరణ కోరుతూ నాలుగుసార్లు  లేఖలు రాసిందన్నారు. ఆగస్టు 23న పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్‌, ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిలు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ ఏకగ్రీవంగా అధ్యక్షుడిని మాత్రమే ఎన్నుకున్నామని వివరణ ఇచ్చుకున్నారని తెలిపారు. శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక ప్రకటనపై స్పష్టత ఇవ్వలేదన్నారు. కాగా, కుప్పంలో జగన్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. స్కూలు బస్సుల్లో ప్రజలను తరలించేందుకు వీలుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారన్నారు. జగన్‌ పర్యటనకు కుప్పం ప్రజలు దూరంగా ఉంటారని తెలిసే, ఇతర ప్రాంతాలు ప్రజలను తరలిస్తున్నారని రఘురామ ఎద్దేవా చేశారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.