ప్రభుత్వంతో పోరాడి హక్కులను సాధించుకుందాం

ABN , First Publish Date - 2022-05-19T05:15:58+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సంగారెడ్డి, మెదక్‌ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు.

ప్రభుత్వంతో పోరాడి హక్కులను సాధించుకుందాం
మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్నఉపాధ్యాయ సంఘాలు

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉపాధ్యాయసంఘాల ధర్నా

 సంగారెడ్డి రూరల్‌/మెదక్‌ అర్బన్‌, మే. 18: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సంగారెడ్డి, మెదక్‌ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (టీఎ్‌సపీసీ) రాష్ట్ర నాయకులు వై.అశోక్‌కుమార్‌, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం మెడలు వంచి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ   కలెక్టరేట్‌ ఏవో స్వర్ణలతకు వినతిపత్రాన్ని అందజేశారు. మెదక్‌ కలెక్టర్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, యూఎ్‌సపీఎస్‌ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సంగయ్య, వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పదోన్నతులు, బదిలీలను వేసవి సెలవులలోపు చేపట్టాలన్నారు. లాంగ్వేజ్‌ పండిట్‌, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. పీఆర్సీ కమిటీ సూచించిన మేరకు సమగ్ర వైద్య విధానాన్ని తీసుకురావాలన్నారు. సమస్యలపై సర్కార్‌ స్పందించకపోతే ఈ నెల 31న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేశారు.  సంగారెడ్డిలో నిర్వహించిన ధర్నాలో యూఎ్‌సపీసీ జిల్లా నాయకులు కె.అశోక్‌, శ్రీనివాస్‌, సాయిలు, రాంచందర్‌, శ్రీనివా్‌సరావు, లక్ష్మయ్యయాదవ్‌, లక్ష్మి, నరసింహారావు, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. మెదక్‌లో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివా్‌సరావు, పద్మరావు, టీపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ యాదగిరి, జిల్లా నాయకులు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:15:58+05:30 IST