డెంగీని నిర్మూలిద్దాం

ABN , First Publish Date - 2022-05-17T04:31:10+05:30 IST

డెంగీని నిర్మూలిద్దామని అదనపు కలెక్టర్‌ పద్మజారాణి పేర్కొన్నారు.

డెంగీని నిర్మూలిద్దాం
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ పద్మజారాణి

- అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్‌ పద్మజారాణి

నారాయణపేట, మే 16 : డెంగీని నిర్మూలిద్దామని అదనపు కలెక్టర్‌ పద్మజారాణి పేర్కొన్నారు. జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా నారాయణపేట ఆర్డీవో కార్యాలయం సోమవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడా రు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం వల్ల డెంగీని నివారించవచ్చని ప్రతీ ఒక్కరు వ్యాధి నివారణకు కృషి చేయాలనిపిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ వో రాం మనోహర్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శైలజ, వైద్యులు రవీందర్‌, రాఘవేం దర్‌, రహమత్‌, బాలాజీరావు, మాస్‌ మీడియా హన్మంతు, అశోక్‌, గోవిందరాజు, ఏన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

నారాయణపేట రూరల్‌ : డెంగీ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోటకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి వెంకటదాదన్‌ పేర్కొన్నారు. సోమవారం కోటకొండ గ్రామంలో డెంగీ జాతీయ దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.  కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో అశోక్‌రాజ్‌, నాగరాజు, ప్రభావతమ్మ, కామాక్షి, గోవింద్‌రావు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ధన్వాడ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ధన్వాడలో డెంగీ ర్యాలీని పుర వీధుల గుండా నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజ ర్‌ కతలప్ప, ఆశమ్మ, పద్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఏడీస్‌ ఈజిస్టు అనే జాతి దోమకాటు వల్ల డెంగీ వస్తుందన్నారు. వర్షా కాలం వస్తునందున్న దోమలు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 

మక్తల్‌/రూరల్‌ : ప్రతీ ఒక్కరు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచు కోవాలని డాక్టర్‌ సిద్దప్ప పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కర్నీ గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డెంగీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ సిద్దప్ప మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైద్య సిబ్బంది సులోచన, శ్రీధర్‌కుమార్‌, లక్ష్మీ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-17T04:31:10+05:30 IST