పిల్లలను పటాకులు కాల్చనివ్వండి...Sadhguru సందేశం

ABN , First Publish Date - 2021-11-03T16:50:40+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా పిల్లలను పటాకులు కాల్చనివ్వండి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రజలకు పిలుపునిచ్చారు....

పిల్లలను పటాకులు కాల్చనివ్వండి...Sadhguru సందేశం

న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా పిల్లలను పటాకులు కాల్చనివ్వండి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం పేరిట పిల్లలకు పటాకుల ఆనందాన్ని దూరం చేయవద్దని సద్గురు జగ్గీ వాసుదేవ్ కోరారు. పటాకులు కాల్చడంపై నిషేధానికి మద్ధతిచ్చే వారు మూడు రోజుల పాటు కార్యాలయాలకు వెళ్లకుండా త్యాగం చేయాలని ఆయన సూచించారు. పిల్లలు బాణాసంచా ఆనందాన్ని అనుభవించకుండా నిరోధించడానికి వాయు కాలుష్యం గురించి ఆందోళన కారణం కాదని ఆయన పేర్కొన్నారు.


‘‘నేను చాలా సంవత్సరాలుగా క్రాకర్‌ని వెలిగించలేదు. కానీ నా చిన్నప్పుడు దాని అర్థం ఎంత అంటే... సెప్టెంబర్ నెల నుంచి క్రాకర్స్ గురించి కలలు కంటూ, దీపావళి ముగిసిన తర్వాత, వచ్చే ఒకటి-రెండు నెలలు, మేము క్రాకర్లను సేవ్ చేసేవాళ్లం, ప్రతిరోజూ బాణసంచాను చూస్తూనే ఉండే వాళ్లం’’ అని జగ్గీ వాసుదేవ్ ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు.పశ్చిమ బెంగాల్‌లోని కోల్ కత్తా హైకోర్టు విధించిన బాణాసంచా నిషేధాన్ని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు రద్దు చేసింది. సర్టిఫైడ్ గ్రీన్ క్రాకర్లను విక్రయించవచ్చు,కొన్ని ప్రదేశాలలో పేల్చవచ్చని బెంచ్ తీర్పు చెప్పింది.


Updated Date - 2021-11-03T16:50:40+05:30 IST