అధికారులను కొనేద్దాం!

ABN , First Publish Date - 2022-08-07T07:02:18+05:30 IST

అధికారులను కొనేద్దాం!

అధికారులను కొనేద్దాం!

 ఇష్టానుసారంగా బార్లు ఏర్పాటు చేసే యోచనలో యజమానులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ): బార్లను దక్కించుకున్నాం. పాడిన పాటకు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించేశాం. ఎక్సైజ్‌ అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు.. మనకు నచ్చిన చోట బారును ఏర్పాటు చేసుకుందాం. ఇదీ బారు యజమానుల ఆలోచన. దీనికి తగినట్టుగానే ప్రక్రియను పూర్తి చేసే యోచనలో ఎక్సైజ్‌ అధి కారులు ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. విజ యవాడలో 110 బార్లకు 109 కొద్దిరోజుల క్రితం నిర్వహించిన ఈ వేలంలో ఖరారు చేశారు. ఒక్కో బార్‌ను రూ.52 నుంచి 54లక్షల వరకు పాడు కున్నారు. వారిలో ప్రస్తుతం బార్లను నిర్వ హిస్తున్న వారు ఉన్నారు. కొత్తగా బార్లను దక్కిం చుకున్న వారు ఇప్పటి నుంచే బిజినెస్‌ పాయిం ట్‌ను ఎంచుకునే పనిలో ఉన్నారు. వ్యాపారం పుష్కలంగా జరిగే ప్రాంతాలను ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లోగడ బార్ల ఏర్పాటుపై ఎక్కడెక్క ఏర్పాటు చేయాలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈసారి లేవు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దేవాలయాలు, పాఠ శాలలకు సమీపంలో ఏర్పాటు చేయకూడదు. ఈ నిబంధన వద్దే బార్ల ఏర్పాటుకు ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు. మరోపక్క జనావాసాల మధ్య ఏర్పాటు చేసినా రగడ తప్పదని వ్యాపారులు అనుమానిస్తున్నారు. ఇంతకుముందు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసినప్పుడు ఇదే రగడ కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడూ ఆ పరిస్థితి తప్పదని గ్రహించారు. పైగా జాతీయ రహదారులకు పక్కన బార్ల ఏర్పాటు నిషేధం. ఇన్ని నిబంధనలు పాటించి వ్యాపారం చేయడం కష్టమని వ్యాపారులు భావిస్తున్నారు. లక్షలాది రూపాయలకు దక్కించుకున్న బార్ల ద్వారా వీలైనంత త్వరలోనే డబ్బులు చేజిక్కి ంచుకోవాలని యోచిస్తున్నారు. వ్యాపారుల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వారు ఎంచుకున్న ప్రాంతాల గురించి అధికారులకు ఇప్పటికే వివ రించారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభు త్వంలోని కొంతమంది పెద్దలు, ఎక్సైజ్‌ అధి కారులకు సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎక్సైజ్‌ అధికారులు కోరిన కోరికలను తీర్చడానికి వ్యాపారులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.  ప్రస్తుతం బార్లను దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ నేతల బినామీలు ఉన్నారు. దీంతో ఎక్సైజ్‌ అధికారుల తీరు ఎలా ఉండబోతుందో ఇట్టే అర్థమవుతోంది. 


Updated Date - 2022-08-07T07:02:18+05:30 IST