ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డుకట్ట వేద్దాం

ABN , First Publish Date - 2022-01-29T05:42:07+05:30 IST

ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు అందరూ ముందుకు రావాలని శె ట్టూరు జెడ్పీటీసీ మంజునాథ్‌, కురుబ సంఘం తాలుకా అ ధ్యక్షుడు దొణస్వామి వైసీపీ నా యకులను కోరారు.

ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డుకట్ట వేద్దాం
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం నాయకులు


కలిసిరావాలని వ్యతిరేక వర్గీయుల పిలుపు


కళ్యాణదుర్గం, జనవరి 28: ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు అందరూ ముందుకు రావాలని శె ట్టూరు జెడ్పీటీసీ మంజునాథ్‌, కురుబ సంఘం తాలుకా అ ధ్యక్షుడు దొణస్వామి వైసీపీ నా యకులను కోరారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీ యులు శుక్రవారం సమావేశం నిర్వహిం చారు. రైతు మిషన రాష్ట్ర డైరెక్టర్‌ బోయ నరేంద్ర, మున్సిపల్‌ చైర్మెన తలారి రాజ్‌కుమార్‌, కౌన్సిలర్లు ప్రభావతి, తిరు మల చంద్రమ్మ, అబ్రహం, గోళ్ల సూరి, కోనాపురం గం గాధర్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీకోసం కష్టపడుతు న్నవారిపై ఎమ్మెల్యే కక్షసాధిస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటి ఆవరణలో నెమలిమాంసం పెట్టించి అక్రమకేసు బనాయించే య త్నం చేశారని దొణస్వామి అన్నారు. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని అన్నారు. కురుబ రేవన్న ఎదుగుదలను ఓర్చుకోలేక రౌడీషీటర్లతో దాడిచేయించారనీ, నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేసేందుకు యత్నిం చారని ఆరోపించారు. ఎమ్మెల్యేతో విభేదించే పలువురు గ్రామస్థాయి నాయకులపై వివిధ పోలీస్‌స్టేషనలో కేసు లు నమోదయ్యాయని అన్నారు. మున్సిపల్‌ చైర్మెన రాజ్‌కుమార్‌కు ఏడాదిగా కార్యాలయంలో కుర్చీలేకుండా చేశారని అన్నారు. తమ ప్రాంత వాసి కాకపోయినా ఓట్లు వేసి గెలిపించామని, వచ్చే ఎన్నికల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోర తామన్నారు. ఎమ్మెల్యే తీరుపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఐక్యంగా ముందుకు రావాలని పార్టీ నాయకులను కోరారు. ఎమ్మెల్యే అవినీతి, అణిచివేత దోరణిపై నివేధిక తయారుచేసి ముఖ్యమంత్రి జగనకు ఇస్తామని ప్రకటించారు.

 


Updated Date - 2022-01-29T05:42:07+05:30 IST