ఐదు వేల కంటే తక్కువలో స్మార్ట్‌ వాచీలు

ABN , First Publish Date - 2021-07-17T06:06:57+05:30 IST

వాచీ అంటే సమయం చూసుకోవడానికి ఒకప్పుడు. మరి నేడు... అనేకానేక అవసరాలను తీర్చేది. ‘నాయిస్‌’ ఇటీవలే ఇండియా మార్కెట్‌లోకి కొనుగోలు చేయదగ్గ రేటులో స్మార్ట్‌ వాచీ ఒకటి విడుదల చేసింది.

ఐదు వేల కంటే తక్కువలో స్మార్ట్‌ వాచీలు

వాచీ అంటే సమయం చూసుకోవడానికి ఒకప్పుడు. మరి నేడు... అనేకానేక అవసరాలను తీర్చేది. ‘నాయిస్‌’ ఇటీవలే ఇండియా మార్కెట్‌లోకి కొనుగోలు చేయదగ్గ రేటులో స్మార్ట్‌ వాచీ ఒకటి విడుదల చేసింది. సింగిల్‌ చార్జింగ్‌తో ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌కు గ్యారంటీ ఇచ్చింది. ఇదే విధంగా పలు కంపెనీలు గరిష్ఠంగా అయిదు వేల రూపాయలకు వాచీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. 


నాయిస్‌ కలర్‌ఫిట్‌ అలా్ట్ర (రూ.4,999)

ఈ బడ్జెట్‌ స్మార్ట్‌ వాచీ సింగిల్‌ చార్జింగ్‌తో 9 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. ఇటీవలే ఇది మార్కెట్లోకి విడుదలైంది. వందకుపైగా ఫేసులు, అరవై స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇందులో  ఉన్నాయి. ఐపీ68 రేటింగ్‌తో వచ్చిన ఈ వాచీ వాటర్‌ప్రూఫ్‌. హార్ట్‌ రేటు, స్లీప్‌, స్ట్రెస్‌ మానిటర్‌ కూడా ఈ వాచీలో ఉన్నాయి. 


బోట్‌ ఎక్స్‌టెండ్‌ వాచీ (రూ.3,499)

బోట్‌ విడుదల చేసిన మొదటి స్మార్ట్‌ వాచీ ఇది. బిల్ట్‌ అలెక్సాతో విడుదలైంది. 300 ఎంఏహెచ్‌ బ్యాటరీకి తోడు సింగిల్‌ చార్జింగ్‌తో ఏడు రోజుల లైఫ్‌ ఉంటుంది. హార్ట్‌ రేటు సెన్సర్‌, ఎస్‌పీఓ2, స్ట్రెస్‌ మానిటర్‌ ఉన్నాయి. హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీస్‌ని స్ర్టెస్‌ మానిటర్‌ రీడ్‌ చేయగలదు. తద్వారా స్ట్రెస్‌ స్థాయులను సూచిస్తుంది. 1.69 టచ్‌ స్ర్కీన్‌, కలర్‌ డిస్‌ప్లేకు తోడు 50 వరకు కౌడ్‌ ఆధారిత ఫేస్‌లతో ఉంది. 


రెడ్‌మీ వాచీ (రూ.3999)

ఇన్‌ బిల్ట్‌ జీపీఎస్‌తోపాటు హెల్త్‌ ఫీచర్లు సైతం ఉన్నాయి. 230 ఎంఏహెచ్‌ బ్యాటరీ  ఉంది. ఒకసారి చార్జింగ్‌తో పది రోజుల పాటు బ్యాకింగ్‌ ఉంటుంది. దీంట్లో ఉండే సెన్సర్‌ వాతావరణానికి అనుగుణంగా బ్రైట్‌నెస్‌ను మారుస్తుంది. 200కి మించి వాచీ పేసులు, మార్చుకునేందుకు వీలుగా మూడు కలర్‌ స్ట్రాప్స్‌తో విడుదలైంది. 


నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రొ 3 (రూ.4,999)

210 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. పది  రోజుల బ్యాకప్‌ ఉంటుంది. హార్ట్‌రేట్‌, ఎస్‌పీఓ2 మానిటర్‌, 1.55 ఇంచీల ఎల్‌సీడీ స్ర్కీన్‌ ఉన్నాయి. వాటర్‌ రెసిస్టెంట్‌, 14 రకాల స్పోర్ట్‌ మోడ్స్‌, ఆండ్రాయిడ్‌ అలాగే ఐఓఎస్‌ కంపాటిబిలిటీ, క్లౌడ్‌ ఆధారిత ఫేస్‌లు, స్లీప్‌ ట్రాకింగ్‌, ఫిమేల్‌ హెల్త్‌ వంటి సౌలభ్యాలు ఈ వాచీతో ఉన్నాయి. 


ఫైర్‌ బోల్ట్‌ స్మార్ట్‌ వాచీ (రూ.2,999)

ఫైర్‌ బోల్ట్‌ నుంచి వచ్చిన సబ్‌ 3కే స్మార్ట్‌ వాచీ ఇది. సింగిల్‌ చార్జింగ్‌తో 8 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. 1.4 ఇంచ్‌ల ఫుల్‌ హెచ్‌డీ టచ్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లే, హార్ట్‌రేట్‌, ఎస్‌పీఓ2 మానిటర్‌ ఉన్నాయి. వివిధ స్పోర్ట్‌ మోడలకుతోడు స్లీప్‌ సైకిల్‌ను ట్రాక్‌ చేయగలుగుతుంది. 


క్రాస్‌బీట్స్‌ ఇగ్నైట్‌ (రూ.3,299)

వాటర్‌ ప్రూఫ్‌ వాచీ కాగా టచ్‌ స్ర్కీన్‌ కలర్‌ డిస్‌ప్లే, పది రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌,  ఐపీ68 రేటింగ్‌తో వచ్చింది. హార్ట్‌రేటు, బ్లడ్‌ ఆక్సిజన్‌, స్లీప్‌ మానిటర్‌ వంటి  ఇతర ఫీచర్లు ఉన్నాయి. క్లౌడ్‌ బేస్డ్‌ ఫేసులకు తోడు ఆరు స్పోర్ట్‌ మోడ్స్‌ కలిగి ఉంది. 


రియల్మే ఫ్యాషన్‌ వాచీ (రూ.3,499)

ఐపీ 68 రేటింగ్‌తో వచ్చిన ఈ వాచీ వాటర్‌ రెసిస్టెంట్‌. 160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. బ్యాటరీ లైఫ్‌ ఏడు రోజులు. 1.4 ఇంచ్‌ల టచ్‌స్ర్కీన్‌ కలర్‌ డిస్‌ప్లే, హార్ట్‌రేటు, ఎస్‌పీఓ2 ఉన్నాయి. 14 స్పోర్ట్స్‌ మోడ్స్‌తోపాటు స్లీప్‌ ట్రాక్‌ కూడా ఉంది. నడుస్తున్నప్పుడు బర్న్‌ అయిన కేలరీలు, దూరం, నడచిన అడుగులు తెలుసుకోవచ్చు. ఈ వాచీని ఉపయోగించి మ్యూజిక్‌, కెమెరాను సైతం కంట్రోల్‌ చేసుకోవచ్చు.


నాయిస్‌ఫిట్‌ యాక్టివ్‌ (రూ.3,499)

రోజంతా హార్ట్‌ రేటింగ్‌, ఆక్సిజన్‌ మానిటర్‌, స్ట్రెస్‌ మానిటర్‌ ఉన్నాయి. 320 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఏడు రోజుల పాటు బ్యాటరీ లెఫ్‌ ఉంది. 1.28 ఇంచ్‌ కలర్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 14 స్పోర్ట్స్‌ మోడ్స్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌తో కంపాటిబుల్‌, క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ పేస్‌లు కలిగి ఉంది.


అమేజ్‌ఫిట్‌ నియో (రూ.2,499)

160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 28 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ ఉంది. రెట్రో లుక్‌కు తోడు 1.2 ఇంచ్‌ల బ్లాక్‌ అండ్‌ వైట్‌ డిస్‌ప్లే ఎప్పటికీ ఉంటుంది. వాటర్‌ రెసిస్టెన్స్‌ కలిగిన ఈ వాచీ హార్ట్‌ రేటు మానిటర్‌, మూడు స్పోర్ట్స్‌ మోడ్స్‌ కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైస్‌లకు కంపాటిబిలిటీ ఉంది.

Updated Date - 2021-07-17T06:06:57+05:30 IST