పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో మార్పులు

ABN , First Publish Date - 2020-02-10T17:50:49+05:30 IST

పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని యూకేలోని వార్విక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా మేధాశక్తి తగ్గడంతో

పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో మార్పులు

లండన్‌, ఫిబ్రవరి 9 : పిల్లలు కంటినిండా నిద్రపోకుంటే మెదడులో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని యూకేలోని వార్విక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా మేధాశక్తి తగ్గడంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. 9 నుంచి 11 ఏళ్లలోపు వయసు కలిగిన 11వేల మంది బాలలు రోజూ ఎంత సేపు నిద్రపోతున్నారు? వారి మెదళ్లలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అనే అంశాలపై అధ్యయనం అనంతరం వారు ఈవిషయాన్ని వెల్లడించారు. 

Updated Date - 2020-02-10T17:50:49+05:30 IST