సిద్దిపేట: కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత సంచారం బయటపడింది. చిరుత సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండు చిరుతలు అడవిలో సంచరిస్తున్నాయని వారు పేర్కొన్నారు. చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించాయని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు.