కప్పర్లలో చిరుత కలకలం

ABN , First Publish Date - 2022-05-15T06:39:37+05:30 IST

మండంలోని కప్పర్ల గ్రామంలో చిరు త పులి కలకలం రేపింది. శనివారం ఉదయం హార్వెస్టర్‌ తో జొన్న పంటను కోస్తుండగా ఒక్కసారిగా చిరుత దా డి చేసేందుకు యత్నించింది.

కప్పర్లలో చిరుత కలకలం

తాంసి, మే 14 : మండంలోని కప్పర్ల గ్రామంలో చిరు త పులి కలకలం రేపింది. శనివారం ఉదయం హార్వెస్టర్‌ తో  జొన్న పంటను కోస్తుండగా ఒక్కసారిగా చిరుత దా డి చేసేందుకు యత్నించింది. దీంతో రైతులు పరుగులు తీశారు. ఈ విషయం గ్రామస్థులకు తెలపడంతో గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు కర్రల, కత్తులతో చిరుతను అడవిలోకి తరిమికొట్టారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలించారు. గ్రామ సమీపంలోకి చిరుత రావడంతో రైతులు పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. 

Updated Date - 2022-05-15T06:39:37+05:30 IST