ఘజియాబాద్‌లో మరోసారి Leopard ప్రత్యక్షం

ABN , First Publish Date - 2021-11-24T12:48:34+05:30 IST

ఘజియాబాద్‌ నగరంలో మరోసారి చిరుతపులి ప్రత్యక్షమవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు...

ఘజియాబాద్‌లో మరోసారి Leopard ప్రత్యక్షం

ఘజియాబాద్‌: ఘజియాబాద్‌ నగరంలో మరోసారి చిరుతపులి ప్రత్యక్షమవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.ఘజియాబాద్ పరిధిలోని రాజ్‌నగర్‌లోని సెక్టార్ 10లో చిరుతపులి రెండోసారి కనిపించింది. చిరుత చివరిగా నవంబర్ 17వ తేదీన నగరంలో కనిపించింది.మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. చిరుతపులి సంచారం నేపథ్యంలో ప్రజలు రాత్రిపూట తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. రాత్రివేళ తలుపులు మూసి ఉంచాలని పోలీసులు ప్రజలను కోరారు.


గతంలో నగరంలో  చిరుతపులి కనిపించినా, పోలీసులు దాన్ని పట్టుకోలేకపోయారు. అటవీశాఖ ప్రత్యేక బృందం రాజ్‌నగర్ పరిధిలోని సెక్టార్ 10 ప్రాంతానికి వచ్చి చిరుత పులి సంచారంపై ఆరా తీశారు. జనవాసాల్లో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు చెప్పారు.


Updated Date - 2021-11-24T12:48:34+05:30 IST