పిల్లిలా ఆడుతున్న పులి.. పారిపోయిన జనాలంతా షాక్

ABN , First Publish Date - 2021-01-15T20:24:22+05:30 IST

హిమాచల్‌ ప్రదేశ్‌లోని తీర్థన్‌ వ్యాలీ ప్రాంతంలో రోజూలానే ప్రజలు నడుస్తూ వెళుతున్నారు. ఇంతలో అక్కడికొక చిరుత వచ్చింది. రోడ్డుపై చిరుతను చూడగానే అందతా దూరంగా..

పిల్లిలా ఆడుతున్న పులి.. పారిపోయిన జనాలంతా షాక్

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని తీర్థన్‌ వ్యాలీ ప్రాంతంలో రోజూలానే ప్రజలు నడుస్తూ వెళుతున్నారు. ఇంతలో అక్కడికొక చిరుత వచ్చింది. రోడ్డుపై చిరుతను చూడగానే అందతా దూరంగా పారిపోయారు. ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మాత్రం పారిపోలేక అక్కడే నిలబడిపోయారు. దీంతో మిగతావారంతా ఆ ఇద్దరిపై చిరుత దాడి చేస్తుందని భావించారు. వారిద్దరు కూడా తమ ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ విచిత్రంగా ఆ చిరుతపులి వారిపై దాడి చేయలేదు. వారితో ఆడడం ప్రారంభించింది. వారి చేతులను వాసన చూస్తూ, కాళ్లకు రాసుకుంటూ... పులిలా కాకుండా.. అచ్చం పిల్లిలా ప్రవర్తించడం ప్రారంభించింది. 


జంతువును అత్యంత కిరాతకంగా వెంటాడి వేటాడి.. చీల్చి చెండాడే చిరుత మనుషులను చూసి కూడా ఆడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపైకి రావడమే కాకుండా మనుషుల వద్దకు వచ్చి వారితో ఆడడం, గారాలు పోవడం షాక్‌కు గురి చేస్తోంది. ఈ రకంగా వింతగా ప్రవర్తిస్తున్న చిరుతను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ప్రవీణ్‌ కాశ్వాన్‌ కూడా ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘ఈ చిరుత ప్రవర్తనని అంచాన వేయలేకపోతున్నాం. చాలా వింతగా ప్రర్తిస్తోంది’ ఆ వీడియోకు కాశ్వాన్ క్యాప్షన్ కూడా ఇచ్చారు.


గురువారం నుంచి ఈ వీడియో వైరలవుతోందని, అయితే చిరుతతో జనాల ప్రవర్తన సరిగా లేదని అన్నారు. ఈ చిరుతపులి పెంపుడు జంతువులాగా ప్రవర్తిస్తోందని, ఒకవేళ ఆ పులి ఏదైనా ఎస్టేట్ నుంచి తప్పించుకొని ఇటుగా వచ్చి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే వీడియోపై సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే కూడా స్పందించారు. "మనుషులు పెంచిన జంతువుల విషయంలో ఇలాంటి ప్రవర్తన సాధ్యమవుతుంది. ఈ విషయంలో మరింత దర్యాప్తు జరగాలని అన్నారు. అడవి జంతువులను పెంపుడు జంతువులుగా పెంచితే ఇలాంటి విచిత్రమైన ఆశ్చర్యకరమైన ప్రవర్తనను కనబరుస్తాయంటూ పాండే తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Updated Date - 2021-01-15T20:24:22+05:30 IST