బోనులో చిక్కిన చిరుత

ABN , First Publish Date - 2021-08-04T18:26:14+05:30 IST

తాలూకాలోని కైవార హోబళి కొంగనహళ్ళి గ్రామ శివారులోని కొండగుట్టల్లో చిరు త బోనుకు చిక్కింది. ఇటీవల కొద్దిరోజులుగా చిరుత సంచారంతో గ్రామస్తులు భయపడి అటవీశాఖ అధికారుల

బోనులో చిక్కిన చిరుత

చింతామణి(కర్ణాటక): తాలూకాలోని కైవార హోబళి కొంగనహళ్ళి గ్రామ శివారులోని కొండగుట్టల్లో చిరు త బోనుకు చిక్కింది. ఇటీవల కొద్దిరోజులుగా చిరుత సంచారంతో గ్రామస్తులు భయపడి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి చిరుత సంచారం ఉన్నచోటును గుర్తించి బోను అమర్చారు. ప్రాంతీయ అటవీశాఖ అధికారి శ్రీనివాస్‌, సబ్‌ డివిజన్‌ అటవీ అధికారి ధనలక్ష్మి, లోకేశ్‌ తదితరులు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి బోనుకు చిక్కినట్టు అధికారులు తెలిపారు. చిరుతను బెంగళూరు బన్నేరుఘట్ట అటవీప్రాంతానికి తర లిస్తున్నట్టు తెలిపారు. ఎట్టకేలకు చిరుత బందీ కావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 


Updated Date - 2021-08-04T18:26:14+05:30 IST