Abn logo
Jun 3 2020 @ 15:03PM

ఇదిగో.. చిరుత..!

హైదరాబాద్: చిరుత మళ్లీ కనపడింది. రాజేంద్రనగర్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) ప్రహరీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పంట పొలాల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో చిరుత సంచారం నమోదైంది. దీంతో మేనేజ్‌, నార్మ్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంప్‌సలోని క్వార్టర్స్‌లో ఉండేవారు  భయం.. భయంగా కాలం గడుపు తున్నారు. మే 14న గగన్‌పహాడ్‌ పాత కర్నూల్‌ రోడ్డులో రోడ్డుపై కనిపించిన చిరుత అక్కడినుంచి ఓ ఫాంహౌ్‌సలోకి వెళ్లి తిరిగి కనిపించకుండా పోయింది. మే 28న రాజేంద్రనగర్‌ నుంచి నార్మ్‌ మీదుగా మేనేజ్‌ వెళ్లే ప్రాంతంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాల్లో తిరుగుతూ గ్రేహౌండ్స్‌ ప్రహరీపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించింది. దీంతో గ్రేహౌండ్స్‌ అధికారులు నార్మ్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను అలర్ట్‌ చేశారు. మే 29న అటవీశాఖ అధికారులు చిరుత కనిపించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.  సోమవారం రాత్రి 10:56 నిమిషాలకు మేనేజ్‌ ప్రహరీ వద్ద, 11:14 నిమిషాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాల్లో తిరుగుతున్న చిరుత దృశ్యాలు వాటిల్లో రికార్డు  అయ్యాయి. 


బయటికెళ్లేందుకు భయం.. 

మేనేజ్‌ క్వార్టర్స్‌లో ఉండేవారు రాత్రివేళ బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ద్విచక్రవాహనాలపై కూడా బయటకు రావ డం లేదు. కేవలం కార్లు ఉన్న వారు మాత్ర మే వస్తున్నారు. రాజేంద్రనగర్‌లో ఉండే చాలా మంది చిరుత తిరుగుతున్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌), ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలోనే పనులు చేస్తుంటారు. వారు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.  

Advertisement
Advertisement
Advertisement