Viral Video: హైవేపై కారు కింద ఇరుక్కున్న చిరుత.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-06-22T01:53:51+05:30 IST

అడవులు తరిగిపోవడం, ఆహారం లభ్యం కాకపోవడం వంటి కారణాలతో వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనల గురించి తరచుగా వింటున్నాం.

Viral Video: హైవేపై కారు కింద ఇరుక్కున్న చిరుత.. చివరకు ఏమైందంటే..

అడవులు తరిగిపోవడం, ఆహారం లభ్యం కాకపోవడం వంటి కారణాలతో వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనల గురించి తరచుగా వింటున్నాం. వాటి ఆవాసాలను ఆక్రమించుకోవడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఓ చిరుత హైవే దాటడానికి ప్రయత్నించి ప్రమాదానికి గురైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


హైవే దాటడానికి ప్రయత్నిస్తున్న చిరుతను వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ చిరుత ఆ కారు బానెట్ కింద ఇరుక్కుపోయింది. చాలా సేపు బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. డ్రైవర్ కారును వెనక్కి పోనివ్వడంతో అది బయటపడి వేగంగా పారిపోయింది. అయితే ఈ ఘటనలో చిరుతపులికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా, ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. ఆ చిరుతపులికి క్షేమంగా ఉండాలని చాలా మంది ఆకాంక్షింస్తున్నారు. 

Updated Date - 2022-06-22T01:53:51+05:30 IST