వెటర్నరీ వర్సిటీలో మళ్లీ చిరుత

ABN , First Publish Date - 2021-10-20T07:46:27+05:30 IST

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీని చిరుత వదలడం లేదు.

వెటర్నరీ వర్సిటీలో మళ్లీ చిరుత
చిరుతదాడిలో మృతి చెందిన పందిపిల్లలు

మూడు పంది పిల్లలపై దాడిచేసి చంపిన వైనం 


తిరుపతి(విద్య), అక్టోబరు 19: ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీని చిరుత వదలడం లేదు. తాజాగా బుధవారం పందుల పరిశోధన స్థానం వెనుక పొదల్లో చిరుత దాడికి గురై.. చనిపోయిన పంది పిల్లలను గుర్తించారు. వీటి వయసు ఆరు వారాలు. మెడపై చిరుత పంజా గుర్తులున్నాయి. డీఎ్‌ఫవో పవన్‌కుమార్‌, ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌ సాయంత్రం వర్సిటీని సందర్శించి అధికారులతో చర్చించారు. చిరుత దాడిగానే గుర్తించారు. వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి విజ్ఞప్తి మేరకు బోనులు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-20T07:46:27+05:30 IST