రొనాల్డో బాటలో మెస్సీ

ABN , First Publish Date - 2020-03-31T10:18:09+05:30 IST

కరోనా వైరస్‌తో.. క్రీడారంగం కూడా స్తంభించిపో యింది. దీంతో ఫుట్‌ బాల్‌ క్రీడాకారులు తమ జీతాల్లో కోత విధించు కుంటున్నారు. ఇప్పటికే స్టార్‌ ఆటగాడు...

రొనాల్డో బాటలో మెస్సీ

బార్కా ప్లేయర్ల జీతాల్లో కోత


మాడ్రిడ్‌: కరోనా వైరస్‌తో.. క్రీడారంగం కూడా స్తంభించిపో యింది. దీంతో ఫుట్‌ బాల్‌ క్రీడాకారులు తమ జీతాల్లో కోత విధించు కుంటున్నారు. ఇప్పటికే స్టార్‌ ఆటగాడు, యువెంటస్‌ జట్టుకు చెందిన క్రిస్టియానో రొనాల్డో 4 నెలల వేతనాన్ని వదులుకోగా.. తాజాగా బార్సిలోనా క్లబ్‌ ఆటగాడైన లియో నెల్‌ మెస్సీ తన వేతనంలో 70 శాతం కోత విధించుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపా డు. బార్కా జట్టు ఆటగాళ్లంతా జీతంలో 30 శాతం మాత్రమే తీసుకుంటారనీ.. క్లబ్‌కు చెందిన కిందిస్థాయి ఉద్యోగులకు మాత్రం 100 శాతం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మెస్సీ తెలిపాడు. 


Updated Date - 2020-03-31T10:18:09+05:30 IST