Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిమ్మరసం ఇలా!

నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే! అయితే ఆరోగ్య ప్రయోజనం సంపూర్తిగా పొందాలంటే తాగవలసిన నీళ్లు, నిమ్మరసం పరిమాణాల మీద కూడా దృష్టి పెట్టాలి. 


కావలసినవి: 3 కప్పుల నీళ్లు, 6 నిమ్మకాయలు, 2 టేబుల్‌స్పూన్ల తేనె.


తయారీ ఇలా: నిమ్మకాయలను మధ్యకు కోసి, నీళ్లలో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీళ్లు చల్లార్చి, నిమ్మకాయ బద్దలను పిండి, తీసేయాలి. తర్వాత నీళ్లను వడగట్టి సీసాలో నింపుకోవాలి. ఈ నీళ్లను ఓ కప్పులో నింపి, తేనె కలిపి తాగాలి. ఈ నీళ్లు పరగడుపున తాగడం వల్ల వ్యాధినిరోధకశక్తి, జీర్ణశక్తి పెరుగుతాయి. శక్తి సమకూరుతుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...