Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌

కావలసినవి: కొత్తిమీర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌లు - రెండు, నిమ్మకాయ - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - తగినంత, లెమన్‌గ్రాస్‌ స్టాక్‌ - ఒకకప్పు, ఉల్లికాడలు - అరకప్పు.


తయారీ: కొత్తిమీరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయను కట్‌ చేయాలి. క్యారెట్లను తురుముకోవాలి. ఉల్లికాడలను చిన్నగా తరగాలి. ఒక పాత్రలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, లెమన్‌గ్రాస్‌ స్టాక్‌ తీసుకోవాలి. అందులో కొబ్బరిపాలు, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై అరగంటపాటు మరిగించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మరొక పాత్రలోకి వడబోయాలి. అందులో క్యారెట్‌ తురుము, ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు మరిగించాలి. కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకుంటే రుచిగా బాగుంటుంది.

చిక్కుడుకాయ రసంనూడుల్స్‌ సూప్‌ ఉల్లిపాయ సూప్బెండకాయ సూప్‌గుమ్మడికాయ సూప్బీరకాయ సూప్‌సొరకాయ సూప్‌పెస్టో పాస్తా సలాడ్‌ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌క్యారెట్‌ టొమాటో సూప్‌
Advertisement