ఎల్‌ఈఎం పరీక్ష విజయవంతం

ABN , First Publish Date - 2022-08-11T08:35:04+05:30 IST

ఎల్‌ఈఎం పరీక్ష విజయవంతం

ఎల్‌ఈఎం పరీక్ష విజయవంతం

గగన్‌యాన్‌ మిషన్‌లో కీలక ముందడుగు

బెంగళూరు, ఆగస్టు 10: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌లో కీలక ముందడుగు పడింది. ఈ మిషన్‌ కోసం రూపొందిస్తున్న క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ (సీఈఎ్‌స)కు సంబంధించిన లో ఆల్టిట్యూడ్‌ ఎస్కేప్‌ మోటార్‌ (ఎల్‌ఈఎం) పరీక్ష విజయవంతమైంది. శ్రీహరికోటలో బుధవారం ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. క్రూ ఎస్కేప్‌ మిషన్‌.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు గగన్‌యాన్‌ మిషన్‌లోని క్రూ మాడ్యూల్‌ను వేరు చేస్తుంది. దీంతో వ్యోమగాములు సురక్షితంగా బయటపడతారని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం తెలిపింది.

Updated Date - 2022-08-11T08:35:04+05:30 IST