మీటింగ్‌లో ఉన్న దిగ్గజ క్రికెటర్.. షూ లేస్ కట్టాలంటూ వచ్చిన పసివాడు..

ABN , First Publish Date - 2021-01-24T09:40:43+05:30 IST

ఓ దిగ్గజ క్రికెటర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన కుమారుడు గబగబా వచ్చి.. ‘‘నాన్నా నా షూ లేస్ కట్టు’’ అంటూ గోల చేశాడు. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగింది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్, మాజీ దిగ్గజ క్రికెటర్ గ్రేమ్ స్మిత్..

మీటింగ్‌లో ఉన్న దిగ్గజ క్రికెటర్.. షూ లేస్ కట్టాలంటూ వచ్చిన పసివాడు..

కేప్‌టౌన్: ఓ దిగ్గజ క్రికెటర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన కుమారుడు గబగబా వచ్చి.. ‘‘నాన్నా నా షూ లేస్ కట్టు’’ అంటూ గోల చేశాడు. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగింది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్, మాజీ దిగ్గజ క్రికెటర్ గ్రేమ్ స్మిత్.. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో అతని కుమారుడు వచ్చాడు. చేతిలో బ్యాట్ పట్టుకొని ఉన్న ఆ పిల్లాడు.. ‘‘నాన్నా నా షూ లేస్ కట్టవా’’ అంటూ అడగడం వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘‘తండ్రి డ్యూటీలో ఎప్పటికీ పూర్తి కావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Updated Date - 2021-01-24T09:40:43+05:30 IST