Abn logo
Mar 26 2020 @ 08:25AM

ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత

Kaakateeya

గత కాలానికి చెందిన ప్రముఖ నటి నిమ్మీ ముంబైలో కన్నుమూశారు. ఆమె కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ముంబైలోని సర్లా నర్సింగ్ హోమ్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. నిమ్మీ 16 సంవత్సరాల పాటు సినిమాల్లో నటించారు. 1949 నుండి 1965 వరకు ఆమె సినిమాల్లో కనిపించారు. ఆమె అప్పట్లో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు. ఆమె  అసలు పేరు 'నవాబ్ బానో'. నిమ్మీని ప్రముఖ నటుడు దివంగత రాజ్ కపూర్ తెరకు పరిచయం చేశారు.  ఆయనే నవాబ్ బానోను నిమ్మీగా మార్చారు. రాజ్ కపూర్ తన బరసాత్ చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం హిట్ అయిన తరువాత, నిమ్మీ చాలా సినిమాల్లో నటించారు. ఆమె ఆన్, ఉడాన్ ఖటోలా, భాయ్ భాయ్, కుందన్, మేరే మెహబూబ్ తదితర చిత్రాల్లో నటించి ప్రజాదరణ పొందారు. 

Advertisement
Advertisement
Advertisement