న్యాయ సేవలను మరింత విస్తృత పరచాలి

ABN , First Publish Date - 2022-09-26T05:44:34+05:30 IST

రాష్ట్రంలో సామాన్యులకు సైతం న్యాయసహాయం అందేలా న్యాయసేవలను మరింత విస్తృత పరచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, రోటరి క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆదివారం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ ప్రజలకు న్యాయసంబంధిత సమస్యల పరిష్కారంలో

న్యాయ సేవలను మరింత విస్తృత పరచాలి
మాట్లాడుతున్న హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌

నిజామాబాద్‌ లీగల్‌, సెప్టెంబరు 25: రాష్ట్రంలో సామాన్యులకు సైతం న్యాయసహాయం అందేలా న్యాయసేవలను మరింత విస్తృత పరచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, రోటరి క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆదివారం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ ప్రజలకు న్యాయసంబంధిత సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగంలో ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థ లు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని సామాజిక మార్పుకోసం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ పని చేస్తోందన్నారు. ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. న్యాయం ఎల్లవేళలా ప్రజలకు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. ప్రజలకు అవసరమైన న్యాయసేవలు అందించాలని సుప్రీం కోర్టు 70 ఏళ్ల క్రితమే తీర్పులో వ్యక్తికరించిందన్నారు. దానినే చట్టం రూపంలో అమ లు చేస్తున్నామన్నారు. సత్వర న్యాయసేవలో భాగంగా జాతీయ లోక్‌ అదా లత్‌ ద్వారా వేలాది న్యాయసంబంధిత వివాదాలను రాజీ పద్ధతిన పరిష్కరిస్తున్నామన్నారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కార్యచరణ కొనసాగుతోందన్నారు. రోటరీ క్లబ్‌ వారి సహకారంతో దివ్యాంగులైన వందల మం దికి ఉచిత కృత్రిమ అవయవాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. వైకల్యంతో బాధపడుతున్న వారికి కృత్రిమ అవయవాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఇలింటి సేవలను కొనసాగించాలన్నారు. ఆ తర్వాత, న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను సామాన్యులు సైతం సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన మరింత విస్తృతస్థాయిలో కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు అన్నారు. తగినంత న్యాయమూర్తులు, సిబ్బంది లేకపోవడం, విభజన ప్రక్రియ వల్ల కేసుల సంఖ్య ఘననీయంగా పెరిగిపోతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8లక్షల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఒక హైకోర్టు పరిధిలోనే రెండున్నర లక్షల కేసు లు పరిష్కారం కావాల్సి ఉన్నాయన్నారు. ఇరు వర్గాల రాజీ మార్గంలో లోక్‌ అదాలత్‌ ద్వారా ముందుకు వస్తే అనేక పెండింగ్‌ కేసులు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత రోటరీ క్లబ్‌ ద్వారా అంతర్జాతీయస్థాయిలో వివిధ వర్గాల వారికోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీసుధ అన్నారు. దివ్యాంగులకు కృత్రిమ కాలును అందించడం వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  కాగా. నిజామాబాద్‌లో తనకు తొలి పోస్టింగ్‌ అని, ఈ జిల్లాతో అనుబంధం కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఆ తర్వాత, జిల్లాలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను జిల్లా జడ్జీ కే.సునీత హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి తెచ్చారు. కొవిడ్‌ సమయంలో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అవసరమైన వారికి సిలిండర్‌ లు, మందులు అందించామన్నారు. జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆమె తెలిపారు. జిల్లాలో లీగల్‌ సర్వీసెస్‌ సంస్థతో కలిసి జిల్లా యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంద ని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. పేదలకు కావాల్సిన సేవలు అందు తున్నాయన్నారు. కొవిడ్‌ సమయంలో రెండు సంస్థలు కలిసి పనిచేయడం మరచిపోలేనిదని ఆయన అన్నారు. అనంతరం వివిధ శాఖల ఆద్వర్యంలో బాధితులకు మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ చేతుల మీదుగా అందించారు. భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద సైకిళ్లు, ట్రైసైకిళ్లను అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను చీఫ్‌ జస్టిస్‌ సందర్శించారు.   కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్‌ బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం గణపతి, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు సతీష్‌, న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T05:44:34+05:30 IST