రాజంపేట సబ్‌ జైల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు

ABN , First Publish Date - 2021-10-19T04:52:29+05:30 IST

రాజంపేట సబ్‌జైల్‌లో సోమవారం జూనియర్‌ సివి ల్‌ జడ్జి ఎం.సంధ్యారా ణి ఆధ్వర్యంలో న్యా య విజ్ఞాన సదస్సు ని ర్వహించారు.

రాజంపేట సబ్‌ జైల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు
ప్రసంగిస్తున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి

రాజంపేట, అక్టోబరు18 : రాజంపేట సబ్‌జైల్‌లో సోమవారం జూనియర్‌ సివి ల్‌ జడ్జి ఎం.సంధ్యారా ణి ఆధ్వర్యంలో న్యా య విజ్ఞాన సదస్సు ని ర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ పేదలు ఉచిత న్యాయం పొందడానికి అన్ని విధాలా అర్హులన్నారు. లక్ష రూపాయల ఆదాయం లోపు ఉన్న వారందరూ ఉచితంగా న్యాయం పొందవచ్చునన్నారు. భ్రూణహత్యలు చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ మల్‌రెడ్డి, న్యాయవాదులు కాశీవిశ్వనాథ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:52:29+05:30 IST