ప్రధాని మోదీకి లీగల్‌ నోటీస్‌

ABN , First Publish Date - 2022-05-15T08:09:50+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటకలోని హనుమద్‌ జన్మభూమి ట్రస్టు.. ట్రస్టీ గోవిందానంద సరస్వతి లీగల్‌ నోటీసు పంపించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ గడువు

ప్రధాని మోదీకి లీగల్‌ నోటీస్‌

ధర్మారెడ్డిని మాతృశాఖకు పంపాలని డిమాండ్‌

టీటీడీ ఏఈవోగా డిప్యుటేషన్‌ ముగిసిందన్న హనుమద్‌ జన్మభూమి ట్రస్టీ గోవిందానంద


తిరుపతి, మే 14(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటకలోని హనుమద్‌ జన్మభూమి ట్రస్టు.. ట్రస్టీ గోవిందానంద సరస్వతి లీగల్‌ నోటీసు పంపించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ గడువు ముగిసినందున తక్షణం ఆయనను కేంద్రంలోని మాతృశాఖకు పంపించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సంబంధిత కేంద్ర శాఖలు, పలువురు అధికారులకు లేఖలు రాశారు. ఈ నెల 12న జారీ చేసిన లీగల్‌ నోటీసులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘ధర్మారెడ్డి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ అధికారి. ఐడీఈఎ్‌స(ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌) ద్వారా రక్షణ శాఖలో జాయింట్‌ సెక్రటరీ హోదాలో ఉద్యోగం చేస్తున్నారు.


నిబంధనల మేరకు డిప్యుటేషన్‌పై బదిలీ అయితే గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగడానికి వీల్లేదు. ధర్మారెడ్డి ఇప్పటికి ఏడేళ్ల గరిష్ఠ వ్యవధిని పూర్తి చేశారు. శనివారంతో ఆయన గడువు ముగిసింది. కేంద్రం డిప్యుటేషన్‌ పొడిగింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆయన ఇపుడున్న హోదాలో కొనసాగే వీలు లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను మాతృశాఖకు పంపండి’’ అని లీగల్‌ నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర విభాగాలకు రాసిన లేఖల్లో.. ధర్మారెడ్డి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.   

Updated Date - 2022-05-15T08:09:50+05:30 IST