వామపక్షాల నిరసనలు

ABN , First Publish Date - 2021-10-29T04:38:04+05:30 IST

కోడుమూరులోని పాతబస్టాండ్‌లో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

వామపక్షాల నిరసనలు
వెల్దుర్తిలో నిరసన తెలుపుతున్న నాయకులు

కోడుమూరు, అక్టోబరు 28: కోడుమూరులోని పాతబస్టాండ్‌లో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి గఫూర్‌మియ్య, నాయకులు రాజు, వీరన్న, బజారి ఎమ్మార్పీఎస్‌ నాగేష్‌, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. 


గూడూరు: పట్టణంలో సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె.మోహన్‌, సీపీఐ మండల నాయకుడు శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, గోవిందు సీపీఎం నాయకులు దానమన్న, మునెప్ప, ఆటో రాజు పాల్గొన్నారు.


డోన్‌(రూరల్‌): పట్టణంలోని గుత్తిరోడ్డులోని సీపీఐ ఆధ్వర్యంలో అమ్మా హోటల్‌ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి సుగుణమ్మ, బోయబొంతిరాళ్ల గ్రామ సర్పంచ్‌ రవిమోహన్‌, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు ప్రభాకర్‌, అబ్బాస్‌, రణత్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


 పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్‌ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి శివరామ్‌, సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు కొండయ్య, నాగమద్దయ్య, రామాంజనేయులు, చిన్న రెహమాన్‌, నక్కి శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.


బేతంచెర్ల: వామపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా నాయకులు ఎల్లయ్య, వెంకటేశ్వర్లు, డీవైఎఫ్‌ఐ మండల ప్రధాన కార్యదర్శి మధుశేఖర్‌, లారీ, ఆటో, కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.


పత్తికొండటౌన్‌: బైక్‌కు పాడె కట్టి వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా చేపట్టారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు రాజాసాహెబ్‌, రంగారెడ్డి, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు గురుదాసు, సురేంద్ర, తిమ్మయ్య, వీరన్న, ఏఐవైఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పులిశేఖర్‌, సీపీఎం నాయకులు దస్తగిరి పాల్గొన్నారు. 


వెల్దుర్తి: వెల్దుర్తిలో వామపక్షాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.  తాడుతో ఆటోలు లాగి, గ్యాస్‌ సిలిండర్‌ను భుజంపైన మోస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు రాజు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి మాధవస్వామి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌, సీఐటీయూ గౌరవాధ్యక్షుడు రాముడు, ఏఐటీయూసీ నాయకుడు గిరిబాబు, ఏఐటీయుసీ ఆటో యూనియన్‌ నాయకులు  సురేష్‌, శ్రీరాములు, సుధాకర్‌, ఎల్లారెడ్డి, రవి, చలపతి, సీపీఎం మండల నాయకులు వలి, పెద్ద యేసు, నాగరాజు, వెంకట్రాముడు, యాసిన్‌, కిషోర్‌బాబు, సద్దాం, బాషా, తదితరులు పాల్గొన్నారు.


మద్దికెర: మద్దికెర గ్రామంలోని ప్రధాన బస్టాండ్‌ వద్ద సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లను పెట్టి నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేశారు. వివిధ సమస్యలపై అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తహసీల్దార్‌ నాగభూషణానికి వినతిపత్రాన్ని అందజేశారు. సీపీఎం డివిజన్‌ కార్యదర్శి వీరశేఖర్‌, సీపీఐ మండల కార్యదర్శి నెట్టికంటయ్య, పెరవలి సీపీఐ శాఖా కార్యదర్శి సుధాకర్‌, సీపీఐ నాయకులు గుంత నాగన్న పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-29T04:38:04+05:30 IST