పెట్రో ధరలపై వామపక్షాల నిరసన

ABN , First Publish Date - 2021-02-27T05:25:31+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేసి, వచ్చిన ఆదాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోందని వాపపక్షపార్టీ నాయకులు విమరించారు. శుక్రవారం సీఐటీయూతో కలసి ఆటో లకు తాళ్లు కట్టి లాగుతూ, గ్యాస్‌ సిలిండర్లను భుజాలపై మోస్తూ వినూత్నంగా కొమ్మాది జంక్షన్‌ వరకు ర్యాలీచేసి అక్కడ రాస్తారోకో చేపట్టారు.

పెట్రో ధరలపై వామపక్షాల నిరసన
కొమ్మాదిలో ర్యాలీ చేస్తున్న సిటూ, వామపక్ష నేతలు

కొమ్మాది, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేసి, వచ్చిన ఆదాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతోందని వాపపక్షపార్టీ నాయకులు విమరించారు. శుక్రవారం సీఐటీయూతో కలసి ఆటో లకు తాళ్లు కట్టి లాగుతూ, గ్యాస్‌ సిలిండర్లను భుజాలపై మోస్తూ వినూత్నంగా కొమ్మాది జంక్షన్‌ వరకు ర్యాలీచేసి అక్కడ రాస్తారోకో చేపట్టారు. పెంచిన పెట్రో, గ్యాస్‌ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. గ్యాస్‌ సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని మోసం చేస్తున్నారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అన్ని పార్టీలు, సంస్థలు, కార్మికులు వ్యతిరేకిస్తున్నా మోదీ పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు డి.అప్పలరాజు, రాజ్‌కుమార్‌, తులసి, గురుమూర్తిరెడ్డి, సీపీఐ నాయకులు వేలంగిణిరావు, మేఘారావు, సీఐటీయూ నేతలు ఎం.వాసు, దుర్గారావు, సన్నీ, దేవరాజ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు. 


ఆరిలోవలో...

ఆరిలొవ, ఫిబ్రవరి 26:  కేంద్ర ప్రభుత్వం  పెంచిన పెట్రోల్‌ డీజల్‌  గ్యాస్‌ ధరలను  వెంటనే రద్దుచేయాలని  సీపీఎం ఆరిలోవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.   ప్రధాన మంత్రి మోదీ రాజీనా మా చేయాలని పార్టీ కార్యదర్శి బి.సూర్యామణి డిమాండ్‌  చేశా రు. గత రెండు నెలల్లో గ్యాస్‌ ధర ఏకంగా రూ.200 పెంచడం దుర్మార్గమన్నారు. అసలు ధర రూ.37 ఉన్న పెట్రోలును రూ.100కు అమ్మడం దారుణమని, ప్రభుత్వం పన్నుల రూపేణా ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుతోందని విమర్శించారు. మోదీ పరిపాలనను అంతమొందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పోరాటాలలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు ఎస్‌.రంగమ్మ, పి.మణి, వి.నరేంద్రకుమార్‌,  పి.శంకర్‌, కృష్ణమూర్తి, నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో

తగరపువలస: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఆలోచన విరమించాలంటూ తగరపువలస కూడలిలో సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. అండర్‌పాత్‌వే వద్ద కార్యకర్తలు వాహనాలను నిలుపుదల చేశారు. రూ.లక్షల కోట్ల విలువైన కర్మాగారాన్ని కారుచౌకగా ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించడం దారుణమన్నారు. రాస్తారోకోతో సర్వీసురోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. సీపీఎం జిల్లా నేత మూర్తి, సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు అప్పలనాయుడు, నరసింగరావు, ఇతర అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:25:31+05:30 IST